హైదరాబాద్

నేటి నుంచి గ్రూప్-2 పరీక్షలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 10: ప్రభుత్వ శాఖల్లోని ఖాళీలను భర్తీ చేసేందుకు గాను శుక్రవారం నుంచి టిపిపిఎస్సీ గ్రూప్-2 పరీక్షలు నిర్వహించనుంది. ఇందులో భాగంగా నగరంలో 11, 13 తేదీల్లో నిర్వహించనున్న ఈ పరీక్ష కోసం నగరంలో మొత్తం 263 విద్యా సంస్థల్లో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు, అన్ని కేంద్రాల్లో లక్షా 15వేల 968 మంది అభ్యర్థులు పరీక్షలు రాయనున్నట్లు అధికార యంత్రాంగం వెల్లడించింది. ముఖ్యంగా పాల్‌ప్రాక్టీస్‌కు పాల్పడకుండా అధికారులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. ఒక వేళ మాల్ ప్రాక్టీస్‌కు పాల్పడితే 5 ఏళ్ల పాటు టిఎస్‌పిఎస్సీ పరీక్షలు, ఇతర రాష్ట్రాలకు చెందిన పిఎస్సీ పరీక్షలు, యుపిఎస్సీ పరీక్షలకు అనర్హులుగా పరిగణించేందుకు సిద్ధమయ్యారు. అభ్యర్థులను పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించేందుకు ప్రత్యేక బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేయనున్నారు. పరీక్షా కేంద్రాల్లోకి వాచీలు, సెల్‌ఫోన్, క్యాలిక్యులేటర్లు వంటి ఏ రకమైన ఎలక్ట్రానిక్ పరికరాలు గానీ గ్యాడ్జెట్లు అనుమతించేది లేదని ఇప్పటికే తేల్చి చెప్పారు. అంతేగాక పరీక్ష రాసే సమయంలో అరగంటకొసారి బెల్ ద్వారా అభ్యర్థులకు సమయాన్ని గుర్తుచేయనున్నారు. అభ్యర్థుల్లో అంధులకు, సెరిబ్రల్ ప్లాసీ, ఆర్థోవికలాంగులకు పరీక్ష రాసేందుకు సహాయకులను అనుమతించనున్నారు. సెరిబ్రల్ వ్యాధితో బాధపడే వారికి మాత్రం గంటకు ఇరవై నిమిషాల చొప్పున అదనంగా సమయాన్ని కేటాయించనున్నారు. పరీక్ష నిర్వాహణ కోసం ఇప్పటికే చీఫ్ సూపరింటెండెంట్లకు అందజేసిన నియమావళి బుక్‌లెట్లలోని నియమనిబంధనలు, సూచనలను అమలు చేస్తూ పరీక్షలను పకడ్బందీగా, సక్రమంగా నిర్వహించాలని సూచించారు. అభ్యర్థులు హాల్‌టికెట్‌తో పాటు పాస్‌పోర్టు, పాన్‌కార్డు, ఓటరు ఐడి, ఆధార్ వంటి ఏదైనా ఫొటో గుర్తింపు కార్డును తప్పనిసరిగా వెంట తీసుకుని రావాలని ఇప్పటికే సూచించారు. పరీక్ష పూర్తయిన తర్వాత సంబంధిత మెటీరియల్(జవాబుపత్రాలు) కూకట్‌పల్లి జెఎన్టీయుకు తరలించనున్నారు. ముఖ్యంగా పరీక్షా కేంద్రాల్లో ఫర్నిచర్, తాగునీరు, టాయిలెట్లు, విద్యుత్ వంటి వౌలిక వసతులను ముందుగానే పరిశీలించి, అవి లేని కేంద్రాలను గుర్తించి ఏర్పాటు చేశారు.
పరీక్షా కేంద్రాల్లోని విద్యాలయాలకు 12న సెలవు : కలెక్టర్
గ్రూప్-2 పరీక్షలు నగరంలో 11న, తిరిగి 13న నిర్వహించనున్నందున, పరీక్షా కేంద్రాల కోసం ఎంపిక చేసిన విద్యాలయాలకు 12వ తేదీన సెలవును ప్రకటిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ రాహుల్ బొజ్జా తెలిపారు. 13న జరిగే పరీక్ష ఏర్పాట్ల కోసం ఈ సెలవును ప్రకటిస్తున్న విషయాన్ని గుర్తించి ఆయా విద్యా సంస్థల యజమాన్యాలు పరీక్ష నిర్వాహణకు సహకరించాలని సూచించారు.