తెలంగాణ

కృష్ణా పుష్కరాలకు 825 కోట్ల నిధులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: గోదావరి పుష్కరాలు నిర్వహించినట్టే కృష్ణా పుష్కరాలూ ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వేద పండితులు నిర్ణయించిన మేరకు ఈ ఏడాది ఆగస్టు 12నుంచి 23వరకు కృష్ణా పుష్కరాలు నిర్వహించాలని సిఎం కె చంద్రశేఖర్‌రావు నిర్ణయించారు. ముఖ్యమంత్రి జన్మదినం సందర్భంగా క్యాంపు కార్యాలయంలో బుధవారం నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఈమేరకు నిర్ణయించారు.
కృష్ణా పుష్కరాల నిర్వహణ వివిధ శాఖల ద్వారా చేపట్టే పనులకు 2016-17 బడ్జెట్‌లో రూ.825.16 కోట్లు కేటాయించాలని సిఎం అధికారులను ఆదేశించారు. రోడ్లు, భవనాలు, నీటిపారుదలశాఖ, పంచాయతీ రాజ్ శాఖల ద్వారా రహదారులు, స్నాన ఘట్టాలు, మంచినీటి నల్లాలు తదితర పనులకు రూ.744.85 కోట్లు ఖర్చవుతుందని అధికారులు అంచనా వేశారు. అంచనా వేసిన నిధులకు అదనంగా రూ.80.31 కోట్లు విడుదల చేయాలని సిఎం అదేశించారు. ఈ నిధులను 2016-17 బడ్జెట్‌లో అంతర్భాగంగా కేటాయించాలని ముఖ్యమంత్రి సూచించారు. భక్తులకు సౌకర్యం కల్పించే విషయంలో నిధులకు కొరత లేకుండా చూడాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు.