తెలంగాణ

పేదల ఖాతాల్లో పెద్దల డబ్బులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, నవంబర్ 13: నల్లధనం గుట్టురట్టు చేసేందుకు వేయి, ఐదువందల రూపాయల నోట్ల రద్దు చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంటే.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో కొందరు బడావ్యాపారులు, కాంట్రాక్టర్లు, ఉన్నతాధికారులు తమవద్ద ఉన్న బ్లాక్‌మనీని ‘వైట్’గా మార్చుకునేందుకు ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నారు. ఇప్పటి వరకు జీరోగా ఉన్న పలువురు అకౌంట్లలో తమ డబ్బు వేయటం ద్వారా, బంగారం కొనుగోలు ద్వారా తమవద్ద నిలువ ఉన్న డబ్బును చలామణీలోకి తీసుకువచ్చేందుకు కొందరు తీవ్ర ప్రయత్నాలలో ఉన్నారు. ఇప్పటికే కొందరు ఈ ప్రయత్నాల్లో సక్సెస్ అవగా, మరికొందరు ఇదే దారిలో తమ డబ్బు వదలించుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. ఈనెల ఎనిమిదివ తేదీన వేయి, ఐదువందల రూపాల నోట్ల చలామణీని రద్దు చేస్తూ, వాటి స్థానంలో రెండువేల రూపాయల నోట్లను బహిరంగ మార్కెట్‌లోకి ప్రవేశ పెడుతు కేంద్రం తీసుకున్న నిర్ణయం వరంగల్ అర్బన్, రూరల్, భూపాలపల్లి, మహబూబాబాద్, జనగామ జిల్లాలలోని సామాన్య ప్రజలతోపాటు బడాబాబులకు తీవ్రకలవరం కలిగించింది. పాతనోట్లను మార్చుకునేందుకు అవకాశం ఇచ్చిన రిజర్వ్ బ్యాంక్ వాటికి పరిమితి విధించటం వీరికి మింగుడుపడని విధంగా మారింది. ఖాతాల్లో జమ చేయాలనుకుంటే రెండున్నల లక్షలు దాటితే లెక్కలు చెప్పవలసి రాటవం, ఒకేసార పెద్దమొత్తంలో బ్యాంకు కౌంటర్లలో మార్చుకునే అవకాశం లేకపోవటం వీరికి సంకటంగా మారింది. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు పెద్దగా లావాదేవీలు లేని ఖాతాలు వీరికి వరంగా మారాయి. ఆయా బ్యాంకుల వారీగా లావాదేవీలు లేని ఖాతాదారుల వివరాలు సేకరించి వారి ఖాతాల్లో తమ డబ్బు వేసి నిర్ణీత వ్యవధిలో వైట్‌గా మార్చుకునే ప్రయత్నాలు మొదలయినట్లు విశ్వసనీయ సమాచారం. ఇందుకుగాను ఆయా ఖాతాదారులుకు లక్షకు కొంతమొత్తం చొప్పున చెల్లించేందుకు ఒప్పందాలు కుదుర్చుకుంటున్నట్లు తెలుస్తోంది. పూర్వ వరంగల్ జిల్లా పరిధిలోని చాలా బ్యాంకుల్లో నెలల తరబడిగా లావాదేవీలు లేని ఖాతాల్లోకి తాజాగా విడతల వారీగా డబ్బులు పడుతున్నట్లు బ్యాంకింగ్ వర్గాలు చెబుతున్నాయి. ఇకపోతే తమవద్ద ఉన్న డబ్బుతో బంగారం కొనుగోలు ద్వారా వదిలించుకునే ప్రయత్నాలను బడాబాబులు జోరుగా కొనసాగిస్తున్నట్లు సమాచారం. తమ వద్ద నిలువ ఉన్న డబ్బును మార్చుకునే ప్రయత్నంలో భాగంగా చాలామంది బంగారం కొనుగోళ్లపై పడటంతో 31వేల ధర పలికిన బంగారం ధర 40నుంచి 45వేల వరకు ఎగబాకింది. కొనుగోళ్లు భారీగా జరగటంతో మొదటి రెండురోజుల్లోనే వరంగల్, జనగామ, మహబూబాబాద్ తదితర ప్రాంతాల్లో బంగారం వ్యాపారుల వద్ద నిలువలు నిండుకున్నాయి. బ్లాక్‌మనీతో బంగారం కొనుగోళ్లు జరుగుతున్నాయనే సమాచారంతో ఆదాయం, వాణిజ్య పన్నుల శాఖలు, మరికొన్ని శాఖలు బంగారం వ్యాపారులపై నిఘా పెట్టడంతో వ్యాపారులు బహిరంగ విక్రయాలకు ఫుల్‌స్టాప్ పెట్టడంతోపాటు రెండురోజుల నుంచి దుకాణాలను కూడా మూసివేసారు. ఎవరైనా బంగారం కావాలని అడిగితే స్టాకు లేదంటు సమాధానం ఇస్తున్నారు. కానీ అప్పనంగా వచ్చే ఆదాయంపై ఆశ పెట్టుకున్న కొందరు వ్యాపారులు వడ్డీ వ్యాపారులు కుదవ పెట్టుకున్న బంగారం నగలను కాస్త ఎక్కువ ధరకు కొనుగోలు చేసి, వాటిని కరిగించి లాభం వేసుకుని విక్రయిస్తున్నారని వ్యాపారవర్గాల్లో ప్రచారం జరుగుతోంది.