తెలంగాణ

అన్నదాతలకు పెద్ద దెబ్బ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిద్దిపేట, నవంబర్ 13: కేంద్ర ప్రభుత్వం 500, వెయ్యి పెద్దనోట్లు రద్దు చేస్తున్నట్లు నిర్ణయం తీసుకోవటంతో మార్కెట్ యార్డుల్లో వ్యాపారులు రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసి డబ్బులు సకాలంలో చెల్లించకపోవటంతో అన్నదాతలు తీవ్ర అవస్థలు పడుతున్నారని రాష్ట్ర నీటిపారుదల, మార్కెటింగ్ శాఖ మంత్రి హరీశ్‌రావు వెల్లడించారు. తమ వద్ద డబ్బులు అందుబాటులో లేవని, బ్యాంకుల్లో 10వేలకు మించి చెల్లించటం లేదని, తాము రైతులకు ఎలా చెల్లించేదని వ్యాపారులు వాపోతున్నారన్నారు. ఆదివారం సిద్దిపేట జిల్లా కేంద్రంలోని మార్కెట్‌యార్డులో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మంత్రి హరీష్‌రావు మాట్లాడారు. ధాన్యం విక్రయయించిన డబ్బు రెండో పంట పెట్టుబడులకు సరిపోతుందని ఆశప డిన అన్నదాతలకు నిరాశే మిగిలిందన్నారు. హైదరాబాద్‌లో మలక్‌పేట మార్కెట్‌యార్డులో ధాన్యం కొనుగోళ్లు నిలిపివేస్తున్నట్లు ప్రకటించిన విషయాన్ని గుర్తుచేశారు. మొక్కజొన్న, వరి ధాన్యం ప్రభుత్వ సంస్థలైన సివిల్‌సప్లయ్స్, మార్క్‌ఫెడ్ ద్వారా కొనుగోలు చేస్తున్నారన్నారు. పప్పు దినుసులు, ఉల్లిగడ్డలను మార్కెట్‌యార్డులో కమీషన్ ఏజెం ట్లు, వ్యాపారులు కొనుగోలు చేయ టం లేదన్నారు. పప్పు దినుసులు కొనుగోలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం పక్షాన కేంద్రానికి లేఖ రాసిన్నట్లు వెల్లడించారు. రైతులు సాగుచేసిన పప్పుదినుసులు కంది, సోయా, పెసర్లను నాఫెడ్ సంస్థ ద్వారా కొనుగోలు చేయాలని లేఖలో పేర్కొంటున్నట్లు తెలిపారు. మార్కెట్ యార్డుల్లో ధాన్యం కొనుగోలు చేసిన కమిషన్ ఏజెంట్లకు బ్యాంకుల్లో ఇచ్చే పరిమితిని పెంచాలని డిమాండ్ చేశారు. రైతులకు రెండవ పంట పెట్టుబడులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రైతులకు రుణమాఫీ మూడవ విడుత చెల్లించిన బ్యాంకర్లు రైతులకు కొత్తగా రుణాలు ఇవ్వటంతో నిర్లక్ష్యం చేస్తున్నారని విమర్శించారు. బ్యాంకర్లు నగదు మార్పిడిపై బిజీగా ఉన్నారని, రైతులకు సకాలంలో రుణాలు అందించే విధంగా ఆర్‌బిఐ ఆదేశాలు జారీ చేయాలన్నారు. రైతులు రైతుబంధు పథకాన్ని వినియోగించుకొని ధాన్యన్ని గోడౌన్లలో నిల్వ చేసుకోవాలన్నారు. రైతుబంధు పథకంలో 75శాతం డబ్బులు రైతులకు రుణం రూపేణా చెల్లిస్తారన్నారు. సోయాబీన్ ధాన్యం ధర పెరిగే అవకాశం ఉందని నిల్వచేసుకుంటే అధిక లాభాలు గడించే అవకాశం ఉందన్నారు. రైతులకు రుణాలు మంజూరు చేసేందుకు కేంద్ర చొరవ చూపాలని, రైతులకు బ్యాంకుల్లో డబ్బులు విత్‌డ్రా చేసుకునేందుకు పరిమితి పెంచాలని, కేంద్ర ప్రభుత్వం కౌంటర్లు ఏర్పాటు చేసి పప్పు దినుసులు కొనుగోలు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసినట్లు మంత్రి హరీష్‌రావు వెల్లడించారు. వ్యాపారస్థులు కొనుగోళ్లు నిలిపివేయకుండా రైతులకు అండగా ఉండాలని, కొనుగోలు చేసిన ధాన్యానికి చెక్కులు అందచేయాలని సూ చించారు. ఉప్పు కొరత వదంతులు నమ్మవద్దని.. ఉప్పు కొరత లేదని రాష్ట్ర మార్కెటింగ్ శాఖ మంత్రి హరీష్‌రావు స్పష్టం చేశారు.

చిత్రం..సిద్దిపేట మార్కెట్‌యార్డులో విలేఖరుల సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి హరీశ్‌రావు