తెలంగాణ

జనం రోడ్డెక్కితే..?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 16: పెద్ద నోట్ల రద్దు పరిణామాలతో సామాన్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ వ్యాఖ్యానించారు. కేంద్రం నిర్ణయం తప్పంటూ ప్రజలు రోడ్డెక్కితే అందుకు రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. నోట్ల రద్దుతో సామాన్యులు ఎదుర్కొంటున్న సమస్యలపై బ్యాంకర్లు ప్రత్యేక దృష్టి సారించాలని మంత్రి కోరారు. గ్రామీణ ప్రాంతాల్లో నెలకొన్న పరిస్థితులపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, ఆర్థికశాఖ అధికారులు, బ్యాంకర్లతో కలిసి బుధవారం సచివాలయం నుంచి కలెక్టర్లతో మంత్రి ఈటల వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. నల్లధనం నియంత్రణకు కేంద్రం తీసుకున్న నిర్ణయం పట్ల సామాన్యుల్లో వ్యతిరేకత రాకుండా నగదు చెలామణి పెరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. పెద్ద నోట్ల రద్దు వల్ల సామాన్య ప్రజానీకం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. భవన నిర్మాణ కార్మికులుగా జీవనం సాగించే అడ్డామీది కూలీల పరిస్థితి దారుణంగా మారిందన్నారు. రవాణాపరంగా ఆటోలు, ట్యాక్సీలు, డిసిఎంలు, చిన్న చిన్న షాపుల్లో పాత నోట్లతో సరుకుల కొనుగోలుకు అనుమతి ఇచ్చే ఆంశాన్ని బ్యాంకర్లు పరిశీలించాలని మంత్రి సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో గంభీరమైన వాతావరణం నెలకుందని, ప్రజలు అసహనంతో రోడ్డెక్కితే చాలా ఇబ్బందికర పరిస్థితి తలెత్తుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. పెళ్లిళ్ల సీజన్ కావడంతో ఏర్పడే ఇబ్బందులనూ బ్యాంకర్లు దృష్టిలో పెట్టుకోవాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాల షాపుల్లో పాత నోట్లు తీసుకునేందుకు అవకాశం కల్పించాలన్నారు. బ్యాంకులు ప్రస్తుతం అందుబాటులోకి తెచ్చిన రూ.2000 నోటుకు చిల్లర లభించని పరిస్ధితి ఏర్పడిందని, దీన్ని అధిగమించడానికి రూ.100, 50, 20 నోట్లను సాధ్యమైనంత త్వరగా అందుబాటులోకి తెచ్చేందుకు కృషి చేయాలని మంత్రి సూచించారు. అలాగే వ్యక్తిగతంగా ఒక్కొక్కరికీ రూ.10 వేలు, వ్యాపారానికి రూ. 50 వేల నుంచి రూ.2 లక్షల వరకు డబ్బులు డ్రా చేసుకొనే అవకాశం కల్పించాలని ఆర్బీఐకి మంత్రి విజ్ఞప్తి చేశారు. ఆన్‌లైన్ ద్వారా డబ్బుల లావాదేవీలు జరిపై వారి సంఖ్య చాలా తక్కువగా ఉంటుందని, గ్రామాల్లో నోట్ల చెలామణి తప్ప మరో ప్రత్యామ్నాయం లేదన్నారు. డబ్బు అందుబాటులో లేకపోవడం వల్ల ప్రజలు తమ పనులను వాయిదా వేసుకునే పరిస్థితి ఏర్పడిందన్నారు. నోట్ల రద్దుతో సామాన్య ప్రజలు పడుతున్న ఇబ్బందులు రోజు రోజుకు తీవ్రతరం కావడంతో ఆందోళనకు గురవుతున్నారన్నారు. ప్రజల ఎదుర్కొంటున్న ఇబ్బందులను తొలగించడానికి ఆర్బీఐ చర్యలు తీసుకుంటే బ్యాంకర్లకు ప్రభుత్వం నుంచి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తామని మంత్రి అన్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ మాట్లాడుతూ నోట్ల రద్దు వల్ల రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను ఎప్పటికప్పుడు కేంద్ర కేబినెట్ కార్యదర్శి దృష్టికి తీసుకెళ్తున్నామన్నారు. ఎటిఎంలో డబ్బు కొరత సమస్య ఉందన్నారు. రబీ పంటకు అవసరమైన ఇన్‌పుట్స్ కొనుగోలుకు రైతులకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా చర్యలు తీసుకోవాలని కోరినట్టు రాజీవ్ శర్మ తెలిపారు. సహకార బ్యాంకులకు కేవలం రూ.36 కోట్లు మాత్రమే ఇచ్చారని, రైతులేమో 12 లక్షల మంది సహకార బ్యాంకుల్లో ఖాతాదారులుగా ఉన్నారన్నారు. సహకార బ్యాంకులలోనూ రద్దు చేసిన నోట్లు తీసుకునేందుకు అనుమతించాలని కేంద్రాన్ని కోరామన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పోస్ట్ఫాసుల పనితీరును సమీక్షించాలని, ఉపాధి హామీ కూలీలకు వేతనాలు అందేలా చూడాలని, మెక్రో ఎటిఎంల వినియోగాన్ని పెంచాలని బ్యాంకర్లకు రాజీవ్ శర్మ సూచించారు.

చిత్రం... పెద్ద నోట్ల రద్దు పరిణామాలపై కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతున్న మంత్రి ఈటల