జాతీయ వార్తలు

వైభవంగా గాలి కుమార్తె పెళ్లి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హంపి..తిరుమల సెట్టింగ్‌లు
అడుగడుగునా సంపద ప్రదర్శన
50వేల మంది అతిథులు
బాలీవుడ్ స్టార్లతో హంగామా
కోట్లాది రూపాయల ఖర్చు

బెంగళూరు, నవంబర్ 16: సినిమా సెట్టింగ్‌లను తలపించే హంగూ ఆర్భాటం, సినీస్టార్లు, ప్రముఖులు సహా వేలాది మంది అతిథుల మధ్య మైనింగ్ కింగ్ గాలి జనార్ధన రెడ్డి కుమార్తె వివాహం బుధవారం బెంగళూరు ప్యాలెస్‌లో వైభవంగా జరిగింది. కర్ణాటక గవర్నర్ వజూభాయ్ వాలా, రాష్ట్ర హోం మంత్రి పరమేశ్వర, ఇంధన మంత్రి డికె శివ, రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు యెడ్యూరప్ప సహా దాదాపు 50వేల మంది ఈ వివాహానికి హాజరయ్యారు. తెలుగు, కన్నడ సినీ పరిశ్రమలకు చెందిన ప్రముఖులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఓ పక్క జనం వందల కోసం బ్యాంకులు, ఏటిఎం ల వద్ద బారులు తీరిన నేపథ్యంలో కోటానుకోట్ల రూపాయల ఖర్చుతో గాలి కుమార్తె బ్రాహ్మణి వివాహం జరగటం సర్వత్రా విమర్శలకు దారి తీసింది. సుమారు రూ.500 కోట్లు ఖర్చు చేసినట్లు వార్తలు వచ్చాయి. ఆర్భాటం, ఆడంబరాలకు హద్దే లేదన్నట్లుగా ఏర్పాట్లు జరిగాయి. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త కుమారుడైన రాజీవ్‌రెడ్డిని బ్రాహ్మణి వివాహం చేసుకుంది. ఈ పెళ్లిని నిర్వహించేందుకు తిరుపతి నుంచి వేద పండితులు తరలి వచ్చారు. పెళ్లి వేడుకల్లో భాగంగా హంపిలోని విజయవిఠల ఆలయ ప్రతిరూపాన్ని నిర్మించారు. అలాగే తిరుమల సెట్టింగ్‌ను కూడా ఏర్పాటు చేశారు. గత నాలుగు రోజులుగా హడావిడిగా సంపదను వెదజల్లుతూ పెళ్లి వేడుకలు జరిగాయి. బ్రెజిల్ నుంచి సాంబా డాన్సర్లను కూడా తీసుకువచ్చారు. ఎల్‌సిడి స్క్రీన్‌తో ఉన్న వెడ్డింగ్ కార్డుతో ఉన్న గాలి జనార్ధన్ కుమార్తె పెళ్లి చివరివరకు సంపద ప్రదర్శనకు పరాకాష్టగా మారింది. వివాహానికి హాజరైన ప్రతి ఒక్కరికీ స్వీట్లు, మొక్కలను అందించారు. ముఖ్యంగా జనార్ధన్‌రెడ్డి సొంతూరైన బళ్లారి నుంచి అతిథులను ఇక్కడికి తీసుకువచ్చారు. ఈ పెళ్లిలో వాడిన ప్రతి వస్తువు బంగారం లేదా వెండితో చేసిందేనని చెప్తున్నారు. మొత్తం పెళ్లి ప్రాంగణానే్న ఎయిర్ కండిషనర్లతో నింపారు.

బెంగళూరు ప్యాలెస్‌లో గాలి జనార్ధన్‌రెడ్డి కుమార్తె బ్రహ్మణి
వివాహ వేదిక వద్ద వైభవంగా హంపి సెట్టింగ్