తెలంగాణ

ఇదీ ‘వరుస’!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భద్రాచలం, నవంబర్ 16: కరెన్సీ కష్టాలు ఏజెన్సీ ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఓ వైపు బ్యాంకుల వద్ద గంటల కొద్దీ నిరీక్షిస్తూ ఇక్కట్లు పడుతుండగా, మార్కెట్‌లో ఏ వస్తువులు కొనుగోలు చేయాలన్నా చిల్లర సమస్య ఎదురవుతుండడంతో ప్రజలు సహనం కోల్పోతున్నారు. ఎన్నాళ్లీ అవస్థలని నిరాశ చెందుతున్నారు. భద్రాచలం ఏజెన్సీలో ఏ బ్యాంకు వద్ద చూసినా బారులు తీరిన జనమే కన్పిస్తున్నారు. భద్రాచలంలో సూర్యోదయంతోనే బారులుతీరలేక తమవంతుగా తమ బ్యాంక్ పాస్‌బుక్‌లను, న్యూస్ పేపర్ ముక్కలను, ఆఖరికి చెట్టు మట్టలను సైతం లైన్లో నించోబెట్టారు.
పెద్ద నోట్ల మార్పిడి, నిత్యావసర వస్తువుల కొనుగోలుకు అవసరమైన డబ్బులు తీసుకునేందుకు ఏటిఎంలు, బ్యాంకుల వద్ద క్యూలైన్లలో ఆపసోపాలు పడుతున్నారు. ఇంకోవైపు వ్యాపారులు తమ వద్దకు వచ్చిన వినియోగదారులను పాతనోట్లా? కొత్తనోట్లా? అంటూ ప్రశ్నించి, పరిశీలించి తీసుకుంటున్నారు.
పోస్టల్‌శాఖ ద్వారా మొక్కుబడిగా...
పోస్టల్ శాఖ ద్వారా పెద్ద నోట్లను మార్చుకునేందుకు వీలు కల్పిస్తామని కేంద్రం చేసిన ప్రకటన ప్రచారానికే పరిమితమైంది. పోస్టల్ శాఖ ద్వారా ఎక్కడా పెద్ద నోట్ల మార్పిడి జరగడం లేదు. కారణమేమంటే మాకు డబ్బులు రావడం లేదంటూ పోస్టల్ అధికారులు పేర్కొంటున్నారు. భద్రాచలం హెడ్‌పోస్ట్ఫాస్ పరిధిలోని ఆంధ్రా, తెలంగాణ రాష్ట్రాల్లోని మండలాల్లో 21 సబ్ పోస్ట్ఫాసులు, 140 బ్రాంచి పోస్ట్ఫాసులు ఉన్నాయి. భద్రాచలం హెడ్ పోస్ట్ఫాసుకు రూ.40 లక్షలు వచ్చాయి. వాటిని ఆంధ్రా విలీన ముంపు మండలాల్లోని కూనవరం, వీఆర్‌పురం, ఎటపాక, చింతూరు, తెలంగాణలోని భద్రాచలం, దుమ్ముగూడెం, చర్ల, వెంకటాపురం, వాజేడు, మణుగూరు, బూర్గంపాడు, అశ్వాపురం, మణుగూరు, పినపాకల్లో గల పోస్ట్ఫాసులకు పంపించారు. ఒక్కో పోస్ట్ఫాసుకు రూ.3లక్షలు డిమాండ్ ఉంటే లక్ష మాత్రమే పంపి చేతులు దులుపుకొన్నారు. ఫలితంగా గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు ఎంతో దగ్గరగా ఉండే పోస్ట్ఫాసుల వద్దకు వెళ్లి నిరాశతో వెనుదిరుగుతున్నారు.

ఓ ఎటిఎం వద్ద బారులు తీరిన ప్రజలు