తెలంగాణ

పెద్ద నోట్ల రద్దు ఎఫెక్ట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 18: పెద్ద నోట్ల రద్దు వల్ల రాష్ట్ర ఆదాయం గణనీయంగా పడిపోవడంతో నియోజకవర్గాల అభివృద్ధి నిధులను రాష్ట్ర ప్రభుత్వం నిలుపుదల చేసింది. ఒక్కో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీకి నియోజకవర్గ అభివృద్ధి నిధి కింద రూ.3 కోట్లను వాయిదాల రూపంలో చెల్లిస్తుంది. ఇప్పటికే మూడు విడతలలో రూ.కోటి 12 లక్షలు విడుదల చేసింది. నవంబర్ నెలలో మరో విడత రూ.37.50 లక్షలు చెల్లించాల్సి ఉండగా ఈ నిధులను ఆర్థికశాఖ నిలిపివేసింది. రాష్ట్ర పరిస్థితి మెరుగయ్యే వరకు నియోజకవర్గాల అభివృద్ధి నిధులను రూ.కోటి 50 లక్షల వరకు పరిమితం చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు అధికార వర్గాల సమాచారం. ఇలా ఉండగా స్పెషల్ డవలప్‌మెంట్ ఫండ్ కింద నియోజకవర్గ కేంద్రాలలో ప్రతీ ఎమ్మెల్యేకు కార్యాలయం కమ్ నివాస భవనాన్ని రూ. కోటి వ్యయంతో నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుత ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ఇప్పట్లో వీటికి కూడా నిధులు ఇచ్చే పరిస్థితి లేదని ఆర్థికశాఖ అధికార ఒకరు అభిప్రాయపడ్డారు. కొత్తగా ఏర్పాటు చేసిన జిల్లా కేంద్రాలలో కార్యాలయాల నిర్మాణం కోసం దాదాపు రూ.2000 కోట్లను వచ్చే బడ్జెట్‌లో కేటాయించనున్నట్టు ముఖ్యమంత్రి ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఇప్పట్లో అద్దె భవనాలలోనే వీటిని కొంతకాలం పాటు కొనసాగించాలని కూడా ప్రభుత్వం భావిస్తున్నట్టు ఈ వర్గాల సమాచారం.