తెలంగాణ

33 డిగ్రీ కాలేజీలకు రూ. 150 కోట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 18: తెలంగాణలోని 33 డిగ్రీ కాలేజీల్లో వౌలిక వసతుల కల్పనకు 150 కోట్ల రూపాయిలు వెచ్చించినట్టు ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి చెప్పారు. శుక్రవారం నాడు ఆయన హయత్‌నగర్‌లో డిగ్రీ కాలేజీకి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కెసిఆర్ విద్యాభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని చెప్పారు. హయత్‌నగర్ జూనియర్, డిగ్రీ కాలేజీల్లోని బాలికల వసతికి కోటి రూపాయిలు మంజూరు చేస్తున్నట్టు చెప్పారు. వచ్చే ఏడాది బాలురకు హాస్టల్ మంజూరు చేస్తామని అన్నారు. గతంలో ఏ ప్రభుత్వం ఇవ్వని విధంగా తెలంగాణ ప్రభుత్వం ఇంటర్, డిగ్రీ కాలేజీల్లో ప్రాక్టికల్స్ చేయించడానికి ప్రత్యేకంగా నిధులు ఇచ్చిందని అన్నారు. సిసి కెమరాలు, వౌలిక వసతులు, బయోమెట్రిక్ మిషన్‌లు, స్టోర్సు అన్నింటికీ నిధులు విడుదల చేశామని అన్నారు. కాంట్రాక్టు లెక్చరర్ల క్రమబద్ధీకరణకు న్యాయపరమైన చిక్కులు వల్ల కొంత జాప్యం జరిగిందని తప్పకుండా రెగ్యులర్ చేసి తీరుతామని పేర్కొన్నారు. నాణ్యమైన విద్య పేదలకు అందించాలనే ఉద్ధేశ్యంతోనే సిఎం కెసిఆర్ ఈ ఏడాది 254 గురుకల పాఠశాలలు మంజూరు చేశారని చెప్పారు.
వచ్చే ఏడాది మరో 200 గురుకులాలు మంజూరు చేయనున్నారని పేర్కొన్నారు.వీటి నిర్మాణానికి 10వేల కోట్ల రూపాయిలు ఖర్చవుతుందని చెప్పారు. స్వాతంత్య్రంవచ్చిన నాటి నుండి ఏ ప్రభుత్వమూ ఇన్ని గురుకుల పాఠశాలలను మంజూరు చేయలేదని ఈ ఘనత తెలంగాణ ప్రభుత్వానికే చెందుతుందని అన్నారు.