తెలంగాణ

‘బ్లాక్‌మనీకి కేరాఫ్ అడ్రస్ కాంగ్రెస్’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 18: కాంగ్రెస్ పార్టీ బ్లాక్ మనీకి కేరాఫ్ అడ్రస్ లాంటిదని టిఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ ఆరోపించారు. టిఆర్‌ఎస్ ఎల్‌పి కార్యాలయంలో జరిగిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నోట్ల రద్దుపై ముఖ్యమంత్రి అభిప్రాయం చెప్పాలని కాంగ్రెస్ నాయకులు కోరడం విడ్డూరంగా ఉందన్నారు. నోట్ల రద్దుతో కలిగే పరిణామాలు, రాష్ట్ర ఖజానాపై పడే భారం, ప్రజలకు కలుగుతున్న ఇబ్బందులు తదితర అంశాలపై ముఖ్యమంత్రి ఇప్పటికే అనేక సార్లు అధికారులతో సమావేశాలు నిర్వహించినట్టు చెప్పారు. పెద్ద నోట్ల రద్దును టిఆర్‌ఎస్ స్వాగతిస్తోందని, అయితే ప్రజలకు ఇబ్బంది కలుగకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నట్టు చెప్పారు. మోడీ అపాయింట్‌మెంట్ కోసం కెసిఆర్ వెంపర్లాడుతున్నారని కాంగ్రెస్ నాయకులు అర్ధం లేకుండా మాట్లాడుతున్నారని, ప్రధానమంత్రి ఫోన్ చేసి మాట్లాడేందుకు రావాలని పిలిచినట్టు చెప్పారు. నితీష్ కుమార్ ప్రభుత్వం నోట్ల రద్దును స్వాగతించిందని, ఆయన మంత్రివర్గంలో కాంగ్రెస్ వాళ్లు ఉన్నారని గుర్తు చేశారు.