తెలంగాణ

మిడ్ మానేరు కాంట్రాక్టు రద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 18: మిడ్ మానేరు ప్రాజెక్టులో రూ.347 వ్యయం చేసే కాంట్రాక్టును నీటిపారుదల శాఖ రద్దు చేస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. సెప్టెంబర్‌లో కురిసిన వర్షాల వల్ల మిడ్ మానేరు ప్రాజెక్టులో కట్ట కొట్టుకుపోయిన విషయం తెలిసిందే. వర్షాల వల్ల జరిగిన నష్టాన్ని పరిశీలించడానికి ముఖ్యమంత్రి కెసిఆర్ కరీంనగర్ జిల్లా పర్యటనకు వెళ్లిన సందర్భంగా కాంట్రాక్టును రద్దు చేయాల్సిందిగా అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించిన విషయం తెలిసిందే. దీనిపై రాష్టస్థ్రాయి స్టాండింగ్ కమిటీ విచారణ జరిపి కాంట్రాక్టును రద్దు చేయాల్సిందిగా ప్రభుత్వానికి సిఫారసు చేసింది. దీంతో మిడ్ మానేరు కాంట్రాక్ట్‌ను రద్దు చేయడంతో పాటు తిరిగి టెండర్ల ప్రక్రియను చేపట్టాల్సిందిగా చీఫ్ ఇంజనీర్‌ను ఆదేశించినట్టు నీటిపారుదలశాఖ ముఖ్య కార్యదర్శి ఎస్‌కె జోషి జారీ చేసిన ఉత్తర్వులలో పేర్కొన్నారు.