తెలంగాణ

వెట్టి నుంచి స్వేచ్ఛ వైపు...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాగర్‌కర్నూల్, నవంబర్ 18: నాగర్‌కర్నూల్ జిల్లా నల్లమల ప్రాంతానికి చెందిన 34మంది చెంచులను గుంపుమేస్ర్తి రెండేళ్ల క్రితం కర్నాటకకు తీసుకొనిపోయి వెట్టిచాకిరీ చేయిస్తుండగా, కాంట్రాక్టర్ కబంధహస్తాల నుంచి శుక్రవారం అక్కడి ప్రభుత్వం విముక్తి కలిగించింది. స్వేచ్ఛ కరువై, ఎక్కువ గంటలు వెట్టిచాకిరి చేస్తూ వేధింపులకు, ఆగడాలకు, అణచివేతలకు గురైన కూలీలకు స్వచ్ఛంద సంస్థ, ప్రభుత్వ అధికారుల జోక్యంతో శుక్రవారం స్వేచ్ఛ లభించింది. వెట్టిచాకిరీ నుంచి విముక్తి పొందిన చెంచులు తెలిపిన వివరాల ప్రకారం.. నల్లమల ప్రాంతంలోని చౌటపల్లి గ్రామానికి చెందిన చెంచు లింగస్వామి, నిమ్మల విష్ణు, అంజమ్మతోపాటు ఇతర ప్రాంతాలకు చెందిన 34 మంది కూలీలను అచ్చంపేటకు చెందిన గడ్డం రంగయ్య అనే లేబర్ కాంట్రాక్టర్ రెండేళ్ల క్రితం కర్నాటక రాష్ట్రం బెల్గాం జిల్లా చికోడి అనే ప్రాంతంలో జివిఆర్ కంపెనీ చేపట్టిన రోడ్డు పనులకు తీసుకొని వెళ్లాడు. అక్కడ కంపెనీ ఏర్పాటు చేసిన గుడారాలలో ఉంటూ నూకల అన్నం తింటూ ఉదయం నుంచి రాత్రి వరకు పనులు చేయించారు. ఎదురుతిరిగిన వారిని, ప్రశ్నించిన వారిని కంపెనీ ప్రతినిధులు, లేబర్ కాంట్రాక్టర్ హింసించేవారని వాపోయారు. మానవత్వం పూర్తిగా మరిచిపోయి మృగాలవలే వ్యవహరించేవారని, మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించేవారని ఆవేదనగా చెప్పారు. పనికి వచ్చి చాలారోజులైంది, గ్రామాలకు వెళ్లి బంధువులను చూసి వస్తామని చెప్పినా, పండుగలకు సైతం పంపించేవారు కాదన్నారు. ఎప్పుడు పనిచేయించేవారన్నారు. వీరి వేధింపులను భరించలేక లింగస్వామి, విష్ణులు అక్కడి నుంచి పారిపోయి కాలినడకన 700 కిలోమీటర్లు వ్యయప్రయాసాలకు ఓర్చి స్వస్థలాలకు చెరుకున్నారు. మాకు అన్యాయం జరిగిందని, మాకు రక్షణ కల్పించాలని, వెట్టినుంచి విముక్తి కల్పించాలని నేషనల్ ఆదివాసి సాలిడారిటి కౌన్సిల్ అనే సంస్థ ప్రతినిధులను కలిసి విన్నవించుకున్నారు. ఆ సంస్థ ప్రతినిధులు రాష్ట్ర కో ఆర్డినేటర్ వాసుదేవరావు, జాతీయ ప్రతినిధి కరుణాకర్, సభ్యులు సుభాష్‌లు ప్రతినిధి బృందంగా కూలీలు పనిచేసే ప్రదేశాలను సందర్శించారు. వారి కష్టనష్టాలను, బాధలు, వెట్టిచాకిరిపై అక్కడి లేబర్ అధికారులకు విన్నవించి వారిని వెట్టినుంచి విముక్తి కల్పించి, చర్యలు తీసుకోవాలని, బాధ్యులను అరెస్టు చేయాలని ఫిర్యాదు చేశారు. దీంతో అధికారులు అక్కడికి వెళ్లి పూర్తిస్థాయిలో విచారణ నిర్వహించి ఈనెల 12న లేబర్ కాంట్రాక్టర్ రంగయ్య, అతని కుమారుడు సురేష్‌లను అరెస్టు చేశారు. కూలీలను విడిపించి వారి స్వస్థలాలకు పంపించాలని అధికారులను ఆదేశించడంతో సిఐడి డిఎస్పీ నాగభూషణం పోలీస్ బందోబస్తుతో కార్మిక శాఖాధికారులు శుక్రవారం నాగర్‌కర్నూల్ కలెక్టరేట్‌కు తీసుకువచ్చారు. కలెక్టర్ ఆదేశానుసారం అచ్చంపేట తహశిల్దార్ కార్యాలయానికి వెళ్లి వారిని బైండోవర్ చేసుకొని వెట్టినుంచి విముక్తి కలిగిస్తూ పత్రాలను అందచేయడంతోపాటు నెలరోజుల పాటు రెవిన్యూ అధికారుల పర్యవేక్షణలో ఉండేలా చర్యలు తీసుకున్నారు.

చిత్రం.. వెట్టిచాకిరి నుంచి విముక్తిపొంది కర్నాటకనుంచి ప్రత్యేక బస్సులో నాగర్‌కర్నూల్‌కు వచ్చిన చెంచు కూలీలు