తెలంగాణ

నదులు కనుమరుగైతే జాతి మనుగడ కష్టమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ధర్మపురి, నవంబర్ 20: భారతదేశ ప్రాచీన నాగరికత, సభ్యతా సంస్కృతులకు మూలాధారాలైన, ప్రాతఃస్మరణీయాలైన నదులను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని హరిద్వార్ పీఠాధిపతి మహా మండలేశ్వర కైలాసానంద బ్రహ్మచారి స్వామీజీ ఉద్భోదించారు. ఆదివారం రాత్రి జగిత్యాల జిల్లా ధర్మపురి క్షేత్రంలో గోదావరికి మహాహారతి సమర్పించిన విశేష కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా, నదీ తీరాన నిర్మిత వేదికపైనుండి వేలాదిమందిని ఉద్దేశించి ఆయన ధార్మిక ప్రసంగం చేశారు. దేశ ఔన్నత్యానికి కారణభూతాలైన వేదాలు, శృతి స్మృతులు, పంచ ఆగమాలు, రామాయణ, భారత, భాగవతాలు నదీ తీరాలలోనే రూపుదిద్దుకున్నాయని, మానవ జీవనాధారాలైన నదులు నేడు ప్రగతి పేరున కనుమరుగు అవుతున్నాయని, అది జాతి మనుగడకు ప్రమాదకరమని ఆవేదన వ్యక్తపరిచారు. దైవ, మాతృ స్వరూపమైన గోదావరి నదిని కలుషిత రహితంగా మార్చాలన్నారు. ఒకనాడు గంగానదికి పుష్కరాలలోనే హారతిని నిర్వహించే వారని, నేడు నిత్య హారతిగా మారిందని, గోదావరికీ హారతిని మొక్కుబడిగా కాక, ప్రతినిత్యం ఇవ్వాలని, ఈ స్ఫూర్తి దేశంలోని సమస్త నదుల రక్షణకై కలగాలని ఆకాంక్షించారు.
అమరావతి పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ శివస్వామి ప్రసంగిస్తూ, నదుల పరిరక్షణతోనే భారత దేశ పునర్వైభవం సాధ్యమన్నారు. సూర్యుడు, నీరు, సర్వవ్యాపితాలని, నాసిక్‌నుండి అంతర్వేది వరకు ప్రవహించే గోదావరి కోట్లాది మానవులకు, అంతకు మించి జంతువులకు, క్రిమి కీటకాదులకు ప్రాణాధారమన్నారు. గోసేవ, సనాతన ధర్మరక్షణ, ఆచార, సంప్రయాయాచరణ చేస్తూ, హింసకు దూరంగా ఉండేవాడే హిందువన్నారు. మురళీధర్ రావు చొరవ స్ఫూర్తినివ్వాలని అన్నారు.
బిజెపి జాతీయ కార్యదర్శి మురళీధర్‌రావు, రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్, మనోహర శర్మ, సుగుణాకర్‌రావు, పాపారావు, వీరగోపాల్ తదితరులు పాల్గొన్నారు.

చిత్రం.. ధర్మపురి గోదావరి వద్ద ప్రసంగిస్తున్న హరిద్వార్ పీఠాధిపతి కైలాసానంద బ్రహ్మచారి