తెలంగాణ

ఘనంగా గోదావరి హారతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ధర్మపురి, నవంబర్ 20: కార్తీక మాస ఆదివారం పవిత్ర దినాన రాత్రి జగిత్యాల జిల్లా ధర్మపురి క్షేత్రంలో గోదావరి నదికి హరిద్వార్, అమరావతి పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ కైలాసానంద స్వామి, శ్రీశ్రీశ్రీ శివస్వామిల సమక్షంలో, గోదావరి మహా హారతి ఉత్సవ సమితి వ్యవస్థాపక చైర్మన్, బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు ఆధ్వర్యంలో, మహా హారతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. వేలాది మంది సమక్షంలో మునుముందుగా కాశీ, క్షేత్రానికి చెందిన దుష్యంత్, అదుర్, వినోద్ వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య నదీ పూజాదికాలలో స్వామీజీలు పాల్గొన్నారు. అనంతరం భక్తిశ్రద్ధలతో హారతి సమర్పించారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్, నది హారతి రాష్ట్ర నిర్వాహకుడు వీరగోపాల్, బిజెపి జిల్లా అధ్యక్షుడు పిల్లి శ్రీనివాస్, రాష్ట్ర, జిల్లా, మండల వివిధ పార్టీల ప్రజా ప్రతినిధులు, నాయకులు, విహెచ్‌పి, ఆరెస్సెస్, స్వచ్చంద సంఘాల బాధ్యులు, నాయకులు, భక్తులు పాల్గొన్నారు. తెలంగాణ జీవనధార, దక్షిణగంగానది గోదావరిని పరిరక్షించడానికి శపథం చేయాలని మురళీధర్‌రావు కోరారు. గోదావరి హారతి నిర్వాహకులు, పండితులు, కళాకారులు, పోటీల విజేతలను ఉచిత రీతిన సన్మానించారు. ఈసందర్భంగా నిర్వహించిన భజనలు, సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.
నదుల పరిరక్షణ అందరి బాధ్యత : మురళీధర్‌రావు
భారతీయ ప్రాచీన నాగరికతకు మూలాధారాలైన జీవనదుల పరిరక్షణ బాధ్యత ప్రభుత్వాలతో పాటు ప్రజలకు ఉందని బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి పోల్సాని మురళీధర్‌రావు అన్నారు. ఆదివారం రాత్రి జగిత్యాల జిల్లా ధర్మపురి క్షేత్ర గోదావరి తీరాన నిర్వహించిన గోదావరి హారతి కార్యక్రమానికి ముందు వేదికనుండి ఆయన మాట్లాడుతూ, ప్రాచీన కాలాలలో రాజులు తటాకాలను, చెరువులను నిర్మించి, నదులను కాపాడితే ఇప్పటి వరకు ప్రభుత్వాలు నదీ తీరాల పరిశుభ్రతపైనా దృష్టి నిలపకపోవడం బాధాకరమన్నారు. సరస్వతి నది కనుమరుగుతో నదుల మనుగడపై ప్రశ్నార్థకాలు ఉదయిస్తున్నాయని, గోదావరి రానున్న రోజులలో జీవనరేఖగా నిలువాలన్నదే తమ లక్ష్యమన్నారు. గోదావరి మహా హారతి కొత్త పరంపరకు తెర లేపిందని, నదీ తీరాలలోనే నాగరికతలు విలసిల్లిన విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. హారతిలో సంకల్పం, పవిత్రతలు ఉన్నాయని, తద్వారా భవిష్యత్తులో అభివృద్ధి జరగగలదన్నారు.
దత్త పీఠాధిపతి స్ఫూర్తితో ప్రజల భాగస్వామ్యంతో కాలుష్య రహిత గోదావరి పరిరక్షణకై అంకితమవుతామన్నారు. దండకారణ్యంలో నదీ సంస్కృతి వికాసానికి కృషి చేస్తామన్నారు. నదిని పూజించాలని, భక్తి భావాలను పెంపొందించు కోవాలని కోరారు. త్రిమూర్తుల నిలయమైన ధర్మపురిలో యమ పూజ విశేషమని కీర్తించారు.

చిత్రం.. కార్తీకమాసం సందర్భంగా ఆదివారం ధర్మపురిలో గోదావరికి హారతులిస్తున్న దృశ్యం.