తెలంగాణ

భద్రాచలం థర్మల్‌ను అనుమతించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 20: భద్రాచలంలో ప్రతిపాదించిన వెయ్యి మెగావాట్ల థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని సబ్ క్రిటికల్ యంత్రాలతో ఏర్పాటు చేసేందుకు అనుమతించాలని తెలంగాణా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కేంద్ర ఇంధన శాఖ మంత్రి పీయూష్ గోయల్‌కు విజప్తి చేశారు. చంద్రశేఖరరావు ఆదివారం మధ్యా హ్నం పీయూష్ గోయల్‌ను కలిసి భద్రాచలం థర్మల్ కేంద్రం ఏర్పాటు ఉదయ్, ఎల్‌ఈడి బల్బులను ప్రజలకు పంపిణీ చేయటం తదితర అంశాల గురించి చర్చలు జరిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనే భద్రాచలంలో వెయ్యిమెగావాట్ల థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
నాలుగు థర్మల్ యూనిట్లను ఏర్పాటు చేసే విధంగా కేంద్రానికి, రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య ఒప్పందం కుదిరింది. కేంద్రంలో మోదీ సర్కారు ఏర్పాటైన అనంతరం అధిక కాలుష్యం ఉన్న సబ్ క్రిటికల్ యంత్రాల ఏర్పాటుకు బదులు కాలుష్యాన్ని బాగా తగ్గించే సూపర్ క్రిటికల్ యంత్రాలను ఏర్పాటు చేయాలని, ఇలాంటి యంత్రాలను ఏర్పాటు చేసుకుంటేనే అనుమతులు మంజూ రు చేయాలనే విధాన నిర్ణయం తీసుకున్నారు. దీనితో భద్రాచలం థర్మల్ విద్యుత్ కేంద్రం నిర్మాణం ఆగిపోయింది. రాష్ట్ర ప్రభుత్వం ఈ థర్మల్ విద్యుత్ కేంద్రానికి ఇప్పటికే దాదాపు వెయ్యి కోట్ల రూపాయలను ఖర్చు చేసింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు సబ్ క్రిటికల్ వ్యవస్థను తిరస్కరించటం వల్ల తమ రాష్ట్రానికి వెయ్యి కోట్ల నష్టం సంభవించటంతో పాటు సూపర్ క్రిటికల్ యంత్రాలకు అదనపు ఖర్చు కూడా అవుతుంది కాబట్టి సబ్ క్రిటికల్ వ్యవస్థతో థర్మల్ విద్యుత్ కేంద్రం ఏర్పాటుకు అంగీకరించాలని కెసిఆర్ గోయల్‌ను కోరినట్లు తెలిసింది. సబ్ క్రిటికల్ వ్యవస్థతో దీనిని ముందుకు తీసుకుకోయేందుకు గల అవకాశాల గురించి సంబంధించిన అధికారులతో చర్చించిన తరువాత సానుకూల నిర్ణయం తీసుకుంటామని గోయల్ హామీ ఇచ్చినట్లు టిఆర్‌ఎస్ వర్గాలు వెళ్లడించాయి. భద్రాచలం థర్మల్ విద్యుత్ కేంద్రానికి అనుమతి ఇచ్చేందుకు దీంతో పాటు ఉదయ్ పథకం ప్రకారం విద్యుత్ నష్టాలను మరింత తగ్గించేందుకు తీసుకోవలసిన చర్యల గురించి ఇరువురు నాయకులు సంప్రదింపులు జరిపారు. తెలంగాణా ప్రభుత్వం ఇదివరకే ఉదయ్ ఓప్పందంపై సంతకం చేసింది. కాబట్టి అధికారులతో మరోసారి సమావేశమై జెంకో నష్టాలను తగ్గించేందుకు తీసుకోవలసిన అదనపు చర్యల గురించి చర్చిస్తానని చంద్రశేఖరరావు కేంద్రమంత్రితో చెప్పినట్లు తెలిసింది.
విద్యుత్తును మరింత పొదుపుగా వాడేందుకు గాను ప్రజలకు ఎల్‌ఈడి బల్బులను పంపిణీ చేయటం గురించి కూడా నేటి సమావేశంలో చర్చ జరిగింది. తెలంగాణా ప్రభుత్వం ఇప్పటికే దాదాపు 8లక్షల ఎల్‌ఈడి బల్బులను ప్రజలకు పంపిణీ చేయటం గురించి సిఎం వివరించారు. తమ ప్రభుత్వం మరిన్ని ఎల్‌ఈడి బల్బులను బడుగు,బలహీన వర్గాల ప్రజలకు ఉచితంగా పంపిణీ చేస్తుందని కెసిఆర్ చెప్పినట్లు సమాచారం.