తెలంగాణ

సారథి లేక ‘కుంటుతున్న’ సిసిఎల్‌ఎ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 21: రాష్ట్ర ప్రభుత్వానికి తలభాగంగా చెప్పుకోదగ్గ భూపరిపాలన ప్రధాన కమిషనర్ (సిసిఎల్‌ఎ) పోస్టు ఖాళీగా ఉండటంతో ఈ కార్యాలయం వెలవెల పోతోంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి రెండున్నర ఏళ్లు గడిచినప్పటికీ ఈ పోస్టులో రెగ్యులర్ అధికారిగా నియామకం అయినవారు కేవలం 10 నెలలపాటే ఉన్నారు. మూడు నెలల కింద రేమాండ్‌పీటర్ సిసిఎల్‌ఎ పదవిలో ఉంటూ పదవీవిరమణ చేశారు. ఆ తర్వాత ఈ పోస్టు ఖాళీగానే ఉంది. ప్రభుత్వంలోని అన్ని శాఖల్లో రెవెన్యూకు ప్రత్యేక ప్రతిపత్తి ఉంది. ఏ శాఖకు లేని మెజిస్టీరియల్ అధికారాలు ఈ శాఖకు ఉన్నాయి. సిసిఎల్‌ఎ పోస్టుకు సాధారణంగా సీనియర్ ఐఎఎస్ అధికారినే నియమించడం ఆనవాయితీగా వస్తోంది. సిసిఎల్‌ఎ పదవి చేపట్టిన అధికారి తర్వాత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియామకం కావడం కూడా గత ఆరుదశాబ్దాలుగా ఆనవాయితీగా కొనసాగుతోంది. ప్రస్తుతం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్న రాజీవ్ శర్మ ఈ నెల 30 న పదవీవిరమణ చేస్తున్నారు. సిసిఎల్‌ఏ పోస్టులో ఎవరూ లేకపోవడంతో చీఫ్ సెక్రటరీగా నియామకం అయ్యేవారిని ఇతర పోస్టుల నుండే ఎంపిక చేయాల్సి ఉంటుంది.
జిల్లాల కలెక్టర్లంతా సిసిఎల్‌ఎ పరిధిలోనే పనిచేస్తారు. కలెక్టర్ల పరిపాలనాపరమైన నిర్ణయాలన్నీ సిసిఎల్‌ఎ చూస్తారు. రాష్ట్ర ప్రభుత్వంలో ముఖ్యమంత్రి తర్వాత చీఫ్ సెక్రటరీ, ఆ తర్వాత స్థానం సిసిఎల్‌ఎకు ఉంటుంది. ఇంతటి ప్రాధాన్యత ఉన్న పోస్టు ఖాళీగా ఉండటంతో ఈ శాఖ కుంటినడకన నడుస్తున్నట్టుగా ఉంది.