తెలంగాణ

మత్స్యకారులకు సర్కారు చేయూత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 21: బంగారు తెలంగాణలో మత్స్యకారుల కుటుంబాల్లో వెలుగులు నింపుతున్నామని రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ పేర్కొన్నారు. ‘ప్రపంచ మత్స్యదినోత్సవం’ సందర్భంగా సోమవారం హైదరాబాద్‌లోని ఇందిరాప్రియదర్శిని ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఈటెల మాట్లాడుతూ, నీళ్లు, నిధులు, నియామకాలపై జరిగిన తెలంగాణ పోరాట ఫలితాలు అట్టడుగు వర్గాల వారికి చెందాలన్నదే తమ ఉద్దేశమన్నారు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పథకాల మూలంగా రాష్ట్రంలోని జలాశయాలు నీటితో కళకళలాడుతున్నాయన్నారు.
గత ఆరుదశాబ్దాల నుండి మత్స్యకారులు అంటే కేవలం కోస్తా జిల్లాలకు చెందినవారిగానే గుర్తిస్తూ వచ్చారని ఈటెల గుర్తు చేశారు. తెలంగాణలోని మత్స్యకారులను నిర్లక్ష్యం చేస్తూ వచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. జలవనరులు ఉన్నచోట్ల వాటిపై అధికారం మత్స్యకారులకు ఇవ్వాలన్నదే ముఖ్యమంత్రి కెసిఆర్ ఉద్దేశమన్నారు. ఇప్పటికే మత్స్యకారులతో చర్చించి, వారి సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకున్నామన్నారు. భవిష్యత్తులో ప్రతి కుంట, ప్రతి చెరువును నీటితో నింపి వ్యవసాయానికి నీటిని అందించడంతో పాటు మత్స్యకారులకు ఉపాధి కల్పిస్తామన్నారు.
ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన రాష్ట్ర మత్స్యశాఖ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ మాట్లాడుతూ, మత్స్యకారులకు ఉపాధికల్పించేందుకు, వారికి ఆర్థికంగా చేయూత ఇచ్చేందుకే 40 కోట్ల చేపపిల్లలను రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాల్లో ఉచితంగా పంపిణీ చేశామన్నారు. దేశంలో ఈ తరహా నిర్ణయం తీసుకున్న ఘనత టిఆర్‌ఎస్ ప్రభుత్వానికి దక్కుతుందన్నారు. తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో ఇతర రాష్ట్రాల్లోని మత్స్యకారులు కూడా ఉచితంగా చేపపిల్లలను సరఫరా చేయాలంటూ ఆయా రాష్ట్రప్రభుత్వాలపై వత్తిడి తెస్తున్నారన్నారు. చేపలను నిలువ చేసేందుకు కోల్డ్‌స్టోరేజ్‌లను ఏర్పాటు చేస్తామని, మార్కెటింగ్ సౌకర్యం కల్పిస్తామని వెల్లడించారు. చేపల మార్కెట్ల నిర్మాణానికి అవసరమైన స్థలాన్ని ఇస్తే, నిధులు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రకటించారు. చేపల మార్కెటింగ్ కోసం మత్స్యకారులకు ద్విచక్రవాహనాలు, నాలుగు చక్రాల వాహనాలను 75 శాతం సబ్సిడీపై అందిస్తామని వెల్లడించారు. మత్స్యకారులకు సంబంధించిన కమ్యూనికీ హాళ్ల నిర్మాణాన్ని సంబంధిత సొసైటీలకే అప్పచెబుతామన్నారు. మత్స్యకారులకు వర్తించే ప్రమాదబీమాను లక్ష రూపాయల నుండి ఐదులక్షల రూపాయల వరకు పెంచుతామన్నారు. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు త్వరలో విడుదల చేస్తామని వెల్లడించారు. ఇందిరాప్రియదర్శినీ ఆడిటోరియం ఆవరణలో మత్స్యశాఖ ఏర్పాటు చేసిన ఫోటో ప్రదర్శనను మంత్రులు సమావేశానికి ముందే తిలకించారు. ‘నీలివిప్లవం’ పేరుతో రూపొందించిన పోస్టర్‌ను, మత్స్యకారుల కోసం రూపొందించిన ప్రత్యేక బ్రోచర్‌ను ఈ సందర్భంగా మంత్రులు ఆవిష్కరించారు. మహబూబ్‌నగర్ జిల్లా మత్స్యశాఖ అధికారిగా పనిచేస్తున్న లక్ష్మప్ప రాసిన ‘చేపలు-ఉపాధి’ అనే పుస్తకాన్ని కూడా ఆవిష్కరించారు. చేపపిల్లల పంపిణీలో లక్ష్యాలను పూర్తి చేసిన మెదక్, కరీంనగర్ జిల్లాల మత్స్య సొసైటీ అధ్యక్షులను మంత్రులు ఈ సందర్భంగా సన్మానించారు. చేపపిల్లల పంపిణీ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్న అధికారులను కూడా సన్మానించారు.ఈ కార్యక్రమంలో ముఖ్యకార్యదర్శి సురేష్‌చందా, ఇంచార్జి కమిషనర్ వెంకటేశ్వర్లు, జాయింట్ డైరెక్టర్ శంకర్‌రాథోడ్ తదితరులు పాల్గొన్నారు.

చిత్రం.. ‘ప్రపంచ మత్స్యదినోత్సవం’ సందర్భంగా సోమవారం హైదరాబాద్‌లో
‘నీలివిప్లవం’ పోస్టర్‌ను ఆవిష్కరిస్తున్న మంత్రి ఈటల