తెలంగాణ

ఎవరూ సంతోషంగా లేరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 21: తెలంగాణలో ఏ వర్గం ప్రజలూ సంతోషంగా లేరని, అంతా తీవ్ర ఆందోళనకు, ఇబ్బందులకు గురవుతున్నారని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె లక్ష్మణ్ వ్యాఖ్యానించారు. ఇదే సరైన తరుణంగా తీసుకుని బిజెపి కార్యకర్తలు ప్రజలు ఎదుర్కోంటున్న సమస్యలపై ఉద్యమాలు, పోరాటాలు చేసి బిజెపిని బలీయమైన శక్తిగా తయారుచేయాలని సూచించారు. బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా డాక్టర్ గంగిడి మనోహర్‌రెడ్డి సోమవారం నాడు బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో లక్ష్మణ్ మాట్లాడుతూ తెలంగాణలో రైతులు, విద్యార్థులు, యువకులు, మహిళలు సంతోషంగా లేరని, బిజెపి నేతలు ప్రజల ఇళ్లకు వెళ్లి వారి బాధలు తెలుసుకుని పరిష్కరించాలని, 2019లో అధికారం దక్కించుకోవడమే ప్రధాన ధ్యేయంగా పనిచేయాలని సూచించారు. రైతులకు రుణమాఫీ ఒకేసారి విడుదల చేయకపోవడం వల్ల వడ్డీలు పెరిగిపోతున్నాయని, బ్యాంకులు అప్పులు ఇవ్వకపోవడం వల్ల రైతాంగం ప్రైవేటు వడ్డీ వ్యాపారులపై ఆధారపడాల్సి వస్తోందని అన్నారు.
అప్పుల బాధల వల్లే రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని చెప్పారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ చేయకపోవడం వల్ల పేద, మధ్య తరగతి విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. ఎన్నికల ముందు ఇంటికో ఉద్యోగం ఇస్తామని చెప్పారని, ఇపుడు ప్రభుత్వం మాటతప్పి ఉన్న ఉద్యోగాలను ఊడగొడుతోందని పేర్కొన్నారు. ఇళ్లు లేని పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు నిర్మిస్తామని చెప్పారని, ఎస్సీలకు మూడెకరాల భూమి ఇస్తామని వాగ్దానం చేసి మోసం చేశారని, ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీసుకు వాస్తుదోషం ఉందని కొత్తగా నిర్మించారని, సచివాలయానికి కూడా వాస్తు దోషం అని చెప్పి కూలగొడుతున్నారని, ఇలా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.
ఈ సందర్భంగా మనోహర్‌రెడ్డి మాట్లాడుతూ ప్రజాసమస్యలపై నిరంతర పోరాటం కొనసాగిస్తామని, పార్టీ తనపై ఉంచిన బాధ్యతను సక్రమంగా నిర్వహించి పార్టీని బలోపేతం చేస్తామని అన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే బద్దం బాల్‌రెడ్డి, సంఘటనా ప్రధాన కార్యదర్శి మంత్రి శ్రీనివాసులు, కార్యదర్శులు పి పాపారావు, కోశాధికారి బి శాంతికుమార్, అధికార ప్రతినిధులు కృష్ణసాగరరావు, ఎన్ వి సుభాష్, కొల్లి మాధవి, మీడియా కన్వీనర్ సుధాకర్ శర్మ, కిసాన్ మోర్చా అధ్యక్షుడు గోలి మధుసూదన్‌రెడ్డి, ఎస్సీ మోర్చా అధ్యక్షుడు వేముల అశోక్ తదితరులు పాల్గొన్నారు.