తెలంగాణ

సమ్మక్క తల్లి అరుదెంచిన వేళ.. మురిసిన మేడారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మేడారం: పున్నమి వెనె్నల్లో చందమామ తోడురాగా సమ్మక్కతల్లి చిలకలగుట్ట నుండి గద్దెలకు చేరింది. రెండేళ్లకోసారి జరిగే మేడారం సమ్మక్క - సారలమ్మ జాతరలో ఇదొక అపురూప ఘట్టం కాగా గుట్ట నుండి గద్దెకు చేరే వరకు ఆ అపురూప క్షణాలు భక్తజనకోటికి మరుపురాని, మరచిపోలేని సన్నివేశాలు. చిలకలగుట్ట నుండి మేడారం గద్దెపైకి సమ్మక్కతల్లి అరుదెంచిన అపురూప సన్నివేశం భక్తులను తన్మయత్వానికి గురిచేసింది. సమ్మక్క - సారలమ్మ జయజయ నినాదాలతో.. శివసత్తుల పూనకాలతో.. లక్ష్మీదేవరల విన్యాసాలతో సమ్మక్కతల్లి గద్దెకు చేరి భక్తులకు గురువారం రాత్రి 8:03 గంటలకు సాక్షాత్కరించింది. వరాల తల్లి దర్శనభాగ్యం కోసం కోటి కళ్లు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మహాఘట్టం ఫలించింది. అమ్మ రాకకు గుర్తుగా పోలీసులు మూడుసార్లు గాలిలోకి కాల్పులు జరిపి తల్లి రాకను భక్తజనకోటికి చాటిచెప్పారు. సమ్మక్క రాక సందర్భంగా మేడారం పరిసర ప్రాంతాలు భక్త్భివంతో మురిసిపోయాయి. దారిపొడవున రంగురంగుల ముగ్గులు వేసి మహిళలు తల్లికి సాదరస్వాగతం పలికారు. పూజారులు ఎంపెల్లి మహేష్, కొక్కెర నర్సింహా, చంద బాబూరావు, సిద్దబోయిన ముణేందర్, సిద్దబోయిన లక్ష్మణ్‌రావులు రాత్రి 8:03 గంటలకు సమ్మక్కతల్లిని గద్దెపై ప్రతిష్ఠింపజేశారు. ఆ సమయంలో గద్దెలను శుభ్రపరిచి అరగంటకు ముందు నుండే తల్లుల దర్శనాన్ని అధికారులు నిలిపివేశారు.
వేకువజాము నుండే పూజారులు మేడారంలోని సమ్మక్క గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మధ్యాహ్నం అడవికి వెళ్లి వనం నుండి వెదురు తీసుకువచ్చి గద్దెలపై ప్రతిష్ఠించారు. సమ్మక్క ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం చిలకలగుట్టకు చేరుకుని సాయంత్రం ఐదు గంటల వరకు పూజలు నిర్వహించిన వడ్డెలు సాయంత్రం 5:57 గంటల సమయంలో సమ్మక్కను గుట్టపైనుండి గద్దెకు తీసుకువచ్చారు. దేవాదాయ శాఖ మంత్రి అల్లోల్ల ఇంద్రకరణ్‌రెడ్డి, జిల్లా కలెక్టర్ వాకాటి కరుణ, ఎస్పీ అంబర్‌కిషోర్‌ఝా, మేడారం ట్రస్ట్ బోర్డు చైర్మన్ కాక లింగయ్య, ములుగు ఎఎస్పీ విశ్వజిత్ కంపాటితో పాటు ప్రజాప్రతినిధులు, అధికారులు అమ్మకు ఘనస్వాగతం పలికారు. చిలకలగుట్టపై అమ్మవారి ఆగమనాన్ని సూచిస్తూ అంబర్‌కిషోర్‌ఝా గాలిలోకి ఎకె 47తో మూడుసార్లు కాల్పులు జరిపారు. చిలకలగుట్ట నుండి సమ్మక్క తరలివస్తుండడంతో భక్తులు శివసత్తుల పూనకాలతో ఊగిపోయారు. ‘మా తల్లి సమ్మక్క..సారక్క ఉయ్యాలో.. చల్లంగా చూడు ఉయ్యాలో..’ అనే పూనకాలతో మేడారం మార్మోగింది. అధికార లాంఛనాలతో సమ్మక్కను మేళతాళాలతో, డప్పు వాయిద్యాలతో గిరిజన సంప్రదాయబద్ధంగా వడ్డెలు గద్దెకు తోడ్కొని వస్తుండగా వారివెంట ప్రజాప్రతినిధులు, అధికారులు తోడురాగా తల్లి సమ్మక్కను గద్దెకు చేర్చారు. దారి పొడవునా భక్తులు తల్లి రాకతో పులకించిపోయారు.
అమ్మకు ఘనంగా ఎదురుకోళ్లు
తమ ఇలవేల్పు సమ్మక్క గద్దెకు చేరుతుండగా భక్తజనం ఘనస్వాగతం పలికారు. కోళ్లను, యాటపోతులను బలి ఇచ్చారు. గాల్లోకి కోళ్లను ఎగురవేస్తూ అమ్మకు స్వాగతం పలికారు. పూజారులు సమ్మక్కను సెలవయ్య గుడికి తీసుకుపోయి గిరిజనసాంప్రదాయ పద్ధతిలో పూజలు నిర్వహించారు.
అడుగడుగునా శివసత్తుల పూనకాలు
సమ్మక్క రాకతో భక్తులు..శివసత్తులు పూనకాలతో ఊగిపోయారు. ఎటుచూసిన భక్తుల నోట సమ్మక్క సారలమ్మ నామస్మరణలతో మేడారం హోరెత్తిపోయింది. వరాల తల్లి కరుణించు...చల్లంగా చూడమ్మా అంటూ భక్తకోటి వేడుకుంది.
భారీ బందోబస్తు
సమ్మక్కను చిలుకలగుట్ట నుండి మేడారం గద్దెల వద్దకు తీసుకువస్తుండగా పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటుచేసారు. సమ్మక్కను పూజారులు తీసుకువస్తుండగా రోప్ పార్టీ దుర్భేద్యమైన రక్షణ వలయాన్ని ఏర్పాటు చేసారు. మూడంచెల రోప్‌పార్టీతో సమ్మక్కను గద్దెలవరకు తోడ్కొని వచ్చారు.
తల్లుల సేవలో తరించిన ప్రముఖులు
కోట్లాది మంది భక్తుల ఆరాధ్య దైవమైన మేడారం సమ్మక్క-సారలమ్మ తల్లులను గురువారం ప్రముఖులు దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. వీరిలో ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి, శాసనసభాపతి సిరికొండ మధుసూధనాచారితో పాటు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి అల్లోల్ల ఇంద్రకరణ్‌రెడ్డి, పర్యాటక శాఖ మంత్రి అజ్మీరా చందూలాల్, ప్రభుత్వ సలహాదారు పాపారావులు ఉన్నారు. వీరిలో తల్లులకు తులాభారం సమర్పించి కుటుంబ సమేతంగా మొక్కులు చెల్లించుకున్న మంత్రులు తల్లుల సేవలో తరించిపోయారు.

చిత్రం... వన దేవతలు గద్దె నెక్కిన వేళ దర్శనం కోసం బారులు తీరిన భక్తులు

నేడు కెసిఆర్ రాక
సిఎం పర్యటన ఏర్పాట్లను పర్యవేక్షించిన కడియం
ఆంధ్రభూమి బ్యూరో
మేడారం, ఫిబ్రవరి 18: మేడారం సమ్మక్క-సారలమ్మల దర్శనం కోసం ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు శుక్రవారం మేడారంకు రానున్నారు. ఈ నేపథ్యంలో ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి గురువారం మేడారం జాతరలో అందుకు సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన విలేఖరులతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తరువాత మొట్టమొదటి సారిగా జరుగుతున్న సమ్మక్క- సారలమ్మ జాతరను విజయవంతం చేసేందుకు, జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చేందుకు ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రత్యేక దృష్టిసారించారని ఆయన అన్నారు. భక్తుల సౌకర్యం కోసం కోట్లాది రూపాయల నిధులు కేటాయించి మెరుగైన సౌకర్యాలు కల్పించామని, భక్తులు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా తల్లులను దర్శించుకునే అవకాశం కల్గిందన్నారు. అధికారులు పూర్తి పర్యవేక్షణతో భక్తులకు తగిన సౌకర్యాలు కల్పించడం జరిగిందని సంతృప్తి వ్యక్తం చేశారు. త్రాగునీరు, పారిశుద్ధ్యం, ఆరోగ్య విషయాల్లో ఎక్కడా రాజీపడలేదన్నారు. ఆదివాసి సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతిరూపంగా నిలిచే సమ్మక్క- సారలమ్మ జాతర ప్రాశస్త్యాన్ని మరింతగా తెలంగాణ ప్రభుత్వం విస్తరింపచేస్తుందన్నారు.
సమ్మక్క- సారలమ్మ తల్లుల స్ఫూర్తితోనే తెలంగాణ కల సాకారమైందని మరోసారి కడియం స్పష్టం చేశారు.

జాతరకు జాతీయ హోదా

కేంద్రంతో చర్చలు జరుపుతాం తల్లులను దర్శించుకున్న ఉప ముఖ్యమంత్రి కడియం

ఆంధ్రభూమి బ్యూరో
మేడారం, ఫిబ్రవరి 18: మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరకు జాతీయహోదా కల్పించేందుకు కేంద్రప్రభుత్వంతో చర్చించనున్నట్లు ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి వెల్లడించారు. గురువారం ఆయన కుటుంబ సమేతంగా సమ్మక్క- సారలమ్మ తల్లులను దర్శించుకున్న ఆయన అనంతరం తులాభారంతో మొక్కులు చెల్లించుకున్నారు. తులాభారంలో కడియం 78కేజీలు తూగగా అదే మొత్తంలో బంగారం (బెల్లం) తల్లులకు సమర్పించారు. ఆయన వెంట ఇవో రమేష్‌బాబు, పలువురు అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయనకు ఆలయ సిబ్బంది గిరిజన సాంప్రదాయ పద్ధతిలో ఘనస్వాగతం పలికారు. ముందుగా జాతరలో భక్తులకు అందిస్తున్న ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించిన ఆయన విలేఖరులతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తరువాత తొలిసారిగా జరుగుతున్న మేడారం జాతరకు మునుపెన్నడూ లేని విధంగా భారీ ఎత్తున ఏర్పాట్లు చేపట్టామని ఆయన వెల్లడించారు. ఈ ఏర్పాట్లతో భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలుగకుండా అధికారులు తగు జాగ్రత్తలు చేపడుతున్నట్లు తెలిపారు. భక్తుల సౌకర్యార్ధం మరుగుదొడ్లు, డ్రెస్సింగ్‌రూం, అదనపు స్నానఘట్టాలు, సానిటేషన్, తాగునీటి సరఫరా, భక్తుల కేశఖండనకు కళ్యాణకట్టను ఏర్పాటు చేశామని అన్నారు. జాతరలో ఒకేరోజు 25లక్షల మందికి పైగా స్నానాలు చేసుకునే వీలుగా స్నానఘట్టాలు ఏర్పాటు చేశామన్నారు.
భక్తులు సులభతరంగా చేరుకునే విధంగా అన్ని దారులను వినియోగంలోకి తెచ్చామని అన్నారు. ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా 10వేల మంది పోలీసు సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేశామని, జాతరలో మొట్టమొదటి సారిగా వన్‌వేను కూడా ఏర్పాటు చేశామన్నారు. 4వేల ఆర్టీసి ప్రత్యేక బస్సులను కేటాయించామని, తద్వారా పాతికలక్షల మంది ప్రయాణికులను తరలించే విధంగా చర్యలు చేపట్టామని అన్నారు. జాతరలో 2200 మంది కార్మికులతో పారిశుద్ధ్య పనులు నిర్వహిస్తున్నామని అన్నారు. జాతర అనంతరం మేడారం జాతరను జాతీయ పండుగగా గుర్తించడానికి కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరుపనున్నట్లు తెలిపారు. మళ్లీ 2018 జాతరకు మేడారంకు జాతీయ హోదా కల్పించడమే తమ లక్ష్యమని డిప్యూటీ సిఎం వెల్లడించారు.
సాగునీరు వనరులు లేకపోవటంతో దుబాయి, ముంబాయి, హైదరాబాద్ ప్రాంతాలకు వలస వెళ్లినట్లు తెలిపారు. కొత్తగా నిర్మిస్తున్న రంగనాయక సాగర్ ద్వారా 1.10 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తున్నట్లు పేర్కొన్నారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ రైతు బిడ్డేనని.. ఎమ్మెల్యేగా వున్నా, మంత్రిగా, కేంద్రమంత్రిగా, రాష్ట్ర డిప్యూటీ స్పీకర్‌గా ఉన్నా, సిఎంగా ఉన్నా వ్యవసాయం చేస్తున్నారని మంత్రి హరీశ్‌రావు అన్నారు. రైతుల కష్టాలు, కన్నీళ్లు అన్నీ తెలుసునని, రైతుల కన్నీళ్లు తుడిచేందుకు సాగునీటి రంగానికి ప్రాధాన్యత ఇచ్చి ప్రాజెక్టుల నిర్మాణాన్ని చేపట్టినట్లు తెలిపారు.
రైతులకు నాణ్యమైన 9గంటల కరెంటు పగటి పూట అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఇందుకోసం 25వేల కోట్లతో పనులు చేపట్టినట్లు తెలిపారు. 25వేల కోట్ల మిషన్ కాకతీయతో చెరువుల పునరుద్ధరణ పనులు చేపట్టినట్లు తెలిపారు. రైతులకు సాగునీరు, నాణ్యమైన కరెంటు ఉంటే బంగారు పంటలు పండుతాయన్నారు. రైతుల ఆత్మహత్యలు వుండవని, రైతుల కంట కన్నీరు ఉండదన్నారు. నదులు, నీళ్లు వున్న చోట నాగరికత అభివృద్ధి చెందిందన్నారు. అపర భగిరతుడైన కెసిఆర్ గోదావరి నీటిని 103 మీటర్ల ఎత్తున ఉన్న మేడిపల్లి నుండి 480 మీటర్ల ఎత్తు ఉన్న సిద్దిపేట నీటిని రప్పించే భగీరథ యత్నం చేస్తున్నట్లు పేర్కొన్నారు. సిద్దిపేట జిల్లా, సాగునీరు, రైలు వస్తే రూపురేఖలే మారుతాయన్నారు. ప్రాజెక్టుల నిర్మాణానికి భూ సేకరణకు నాయకులు బాధ్యత తీసుకోవాలన్నారు. రంగనాయక గుట్టను పర్యాటక శాఖగా తీర్చిదిద్దుతానన్నారు. ఈ కార్యక్రమంలో ప్రాణహిత సిఇ హరేరామ, ఎస్‌ఇ గోవిందరావు, ఆర్డీఓ ముత్యంరెడ్డి, ఎంపిపిలు మాణిక్యారెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి, యాదయ్య, జడ్పీటిసి కమల, నాయకులు రాధాకిషన్‌శర్మ, రాజనర్సు, రవీందర్‌రెడ్డి, సర్పంచ్‌లు ఉమేశ్, మంగమ్మ, శ్రీనివాస్‌గౌడ్, సునిత, అరుణ తదితరులు పాల్గొన్నారు.