తెలంగాణ

తప్పుడు ప్రచారంపై కేసులు ఎమ్మెల్సీ కర్నె హెచ్చరిక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 21: టిఆర్‌ఎస్‌పై సామాజిక మాధ్యమాల్లో కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, అలాంటి వారిపై కేసులు పెడతామని టిఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ హెచ్చరించారు. సూర్యాపేటలో ఈదులూరి సంతోష్ అనే వ్యక్తి ఉద్యోగాలు ఇప్పిస్తానని మోసం చేస్తే అతను టిఆర్‌ఎస్ నాయకుడు అని సామాజిక మాధ్యమాల్లో కొందరు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. దాన్ని టివిల్లోనూ ప్రచారం చేస్తున్నారని ప్రభాకర్ తెలిపారు. సంతోష్ గతంలో కాంగ్రెస్‌లో ఉన్నాడని, ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీలో ఉన్నాడని కర్నె వెల్లడించారు. సంతోష్ గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచి సర్పంచ్‌గా పోటీ చేశాడని ఆయన గుర్తుచేశారు. అతను ఉద్యోగులను మోసం చేశాడని టిఆర్‌ఎస్ వాళ్లే కేసు పెట్టారని పోలీసులు అరెస్టు చేశారని ప్రభాకర్ తెలిపారు. మంత్రి జగదీశ్‌రెడ్డి అనుచరుడు అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. తప్పుడు ఆరోపణలు చేసిన వారిపైన పరువు నష్టం కేసు పెట్టనున్నట్టు కర్నె ప్రభాకర్ తెలిపారు.