తెలంగాణ

చేతులెత్తేసిన సహకార బ్యాంకులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాగర్‌కర్నూల్, నవంబర్ 21: పెద్దనోట్ల రద్దు అనంతరం ఎక్కడో ఉత్తరాది రాష్ట్రంలో ఓ సహకార సంఘంలో డబ్బుల వినియోగంలో దుర్వినియోగం జరిగిందనే ఉద్దేశ్యంతో ఆర్‌బిఐ... సహకార బ్యాంకుల విషయంలో జారీ చేసిన ఆదేశాలు రైతుల పాలిట శాపంగా మారాయి. సహకార సంఘాల ఆధ్వర్యంలో నిర్వహంచే బ్యాంకులలో రైతులు తీసుకున్న అప్పులను తీర్చేందుకు పాతనోట్ల చెల్లింపులను పూర్తిగా నిలిపియడంతో సహకార సంఘాల బ్యాంకులలో గత వారం రోజుల నుంచి ఎలాంటి లావాదేవీలు జరగడంలేదు. ఖరీఫ్ పంటలను అమ్ముకున్న రైతులు సహకార సంఘాలలో తీసుకున్న పంట రుణాలను తీర్చుకొంటున్నారు. కానీ.. ఆర్‌బిఐ జారీ చేసిన ఆదేశాలతో గత వారం రోజుల నుంచి రైతులు అప్పుతీర్చేందుకు ముందుకు వస్తున్నా అధికారులు తీసుకోవడంలేదు. దీర్ఘకాలిక, స్వల్పకాలిక రుణాలను తీర్చేందుకు వచ్చామని, రద్దు చేయబడిన నోట్లను తీసుకోవడం జరగదని అంటున్నారని, బ్యాంకులలో రోజువారిగా వడ్డీ వేయడం జరుగుతుందని, డబ్బులున్న వడ్డ్భీరం మోయాల్సిన పరిస్థితి ఏర్పడిందని పలువురు రైతులు వాపోయారు. జాతీయ బ్యాంకులతోపాటు ప్రైవేట్ బ్యాంకులు, గ్రామీణ బ్యాంకులలో రైతులనుంచి డబ్బులు తీసుకుంటున్నారని, ఇక్కడేందుకు తీసుకోరని రైతులు అధికారులను ప్రశ్నిస్తున్నారు. ఇంటిపన్నులు, విద్యుత్ చార్జీలు ఇతరాత్ర వాటికి వినియోగిస్తున్న డబ్బులు డిసిసిబి, సహకార సంఘాల బ్యాంకులలో ఎందుకు తీసుకోరని రైతులు ప్రశ్నిస్తుంటే అధికారులు సమాధానం చెప్పలేకపోతున్నారు. సహకార సంఘాల బ్యాంకులు, డిసిసిబిలలో తీసుకున్న రుణాలలో మొండి బకాయిలను, ఎల్టీ రుణాలను వసూలు చేసుకునేందుకు మంచి అవకాశాలు ఉన్నప్పటికి ఆర్‌బిఐ ఆదేశాలు అవంతరాలుగా మారాయి. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో డిసిసిబి పరిధిలో 84 పిఎసిఎస్‌లు, 20 డిసిసిబి శాఖలు ఉండగా, 1,35,647 మంది రైతుల పంటరుణాల ఖతాలు ఉన్నాయి. దీర్ఘ, స్వల్పకాలిక రుణాలతోపాటు బంగారు తాకట్టు రుణాలు కలిపి మొత్తం 583కోట్లు అప్పులుగా ఇవ్వడం జరిగింది. ఈనెల 8న పెద్దనోట్లను రద్దు చేయగా, రైతులు ఇట్టి నోట్లతో అప్పులు తీర్చుకోవచ్చని కేంద్రం చెప్పటంతో ఈనెల 13 వరకు ఒక్క నాగర్‌కర్నూల్ డిసిసిబి బ్రాంచిలోనే సుమారు రూ.80లక్షల వరకు రైతులు చెల్లించారు. ఈనెల 14న ఆర్‌బిఐ నుంచి ఆదేశాలు రావడంతో అప్పటి నుంచి చెల్లింపులు పూర్తిగా నిలిచిపోయాయి. రద్దు చేయబడిన నోట్లతో వ్యాపార లావాదేవిలకు అవకాశం ఇవ్వకున్నా కనీసం అప్పులు తీర్చుకునేందుకు అవకాశం ఇవ్వాలని అటు సహకార సంఘాల బ్యాంకు అధికారులు, ఇటు రైతులు కోరుతున్నారు. అసలే యాసంగి పంటలను పండించుకునే కాలం పెట్టుబడి కావాలి, కాని సహకార బ్యాంకులు ఇవ్వడంలేదు, ఇతర బ్యాంకులలో ఖాతాలు లేవు మా పరిస్థితి ఏమిటని అమాయకంగా ప్రశ్నిస్తున్నారు. ఇంట్లో శుభకార్యం ఉంది, బ్యాంకులో తాకట్టు పెట్టిన బంగారంను విడిపించుకుందామని వస్తే రద్దు చేయబడిన నోట్లను తీసుకోము అని అధికారులు అంటున్నారని, బంగారం లేకుండానే ఇంట్లో శుభకార్యం జరపాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఒకరంటే ఇంట్లో పెళ్లి జరుగుతున్నా డబ్బులు తీసుకోలేకపోతున్నామని మరోకరు అన్నారు. మొత్తంమీద ఆర్‌బిఐ ఇచ్చిన ఆదేశాలతో సహకార బ్యాంకుల పరిస్థితి ఆగమ్యగోచరంగా మారగా, రైతుల పరిస్థితి మరీదారుణంగా ఉంది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని వాస్తవ పరిస్థితులను కేంద్రానికి, ఆర్‌బిఐ దృష్టికి తీసుకొని పోయి పాతనోట్లతో అప్పులు తీర్చుకునేలా చర్యలు తీసుకోవాలని రైతులు, బ్యాంకు అధికారులు కోరుతున్నారు.
డబ్బులున్న అప్పుతీర్చడంలేదు : యాదమ్మ
పంట అమ్మి వచ్చిన డబ్బుతో సహకార బ్యాంకులో అప్పు తీర్చుకుందామని వస్తే రూ.500, రూ.1000 నోట్లు తీసుకోము అని అంటున్నారని, మా దగ్గర డబ్బులున్న అప్పుతీర్చలేని పరిస్థితిలో ఉన్నామని గగ్గలపల్లికి చెందిన మహిళా రైతు యాదమ్మ వాపోయింది.