తెలంగాణ

ఆర్‌బిఐ వద్ద సిపిఐ ధర్నా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 21:పాతనోట్ల రద్దును నిరసిస్తూ సిపిఐ కార్యకర్తలు అసెంబ్లీ నుంచి ఆర్‌బిఐ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆర్‌బిఐ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. ఈ ధర్నాలో సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు కె నారాయణతోపాటు పలువురు సీనియర్ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ పెద్ద నోట్లపై కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని తీవ్రంగా ఖండించారు. పెద్ద నోట్ల రద్దుతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ప్రత్యామ్నాయం లేకుండా ప్రజలను ఇబ్బందులకు గురిచేసే ప్రధాని మోదీ నిర్ణయం సమంజసం కాదన్నారు. ఇప్పటికైనా పాత కరెన్సీ రద్దుపై కేంద్ర ప్రభుత్వం ఓ నిర్ణయానికి రావాలని, లేనిపక్షంలో దేశం అభివృద్ధి కుంటుపడుతుందన్నారు.
సిఎం గృహ ప్రవేశాన్ని అడ్డుకుంటాం
విద్యార్థుల ఫీజు రియింబర్స్‌మెంట్ బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ సచివాలయం వద్ద టిఎన్‌ఎస్‌ఎఫ్ సోమవారం ధర్నాకు దిగింది. దీంతో సచివాలయం వద్ద కాస్సేపు ఉద్రిక్తత చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. ఆందోళనకారులను చెదరగొట్టి పలువురు నాయకులను అదుపులోకి తీసుకున్నారు.