తెలంగాణ

ప్రజావాణిలో ఉద్యోగిని ఆత్మహత్యాయత్నం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్, నవంబర్ 21: అధికారులు వేధిస్తున్నారంటూ ఔట్ సోర్సింగ్ ఉద్యోగిని ఆత్మహత్యయత్నానికి పాల్పడిన ఘటన కలెక్టరేట్‌లో సోమవారం చోటుచేసుకుంది. కలెక్టరేట్‌లో కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తుండగా, కలెక్టర్‌కు తన బాధను చెప్పుకునేందుకు వచ్చిన స్ర్తి శిశు సంక్షేమ శాఖలో ఆయాగా పనిచేస్తున్న గంగాదేవి కలెక్టర్ వద్దకు రాకుండానే తన వెంట తెచ్చుకున్న హెయిర్ డై తాగి పడిపోయింది. దీనిని గమనించిన సిబ్బంది వెంటనే ఆమెను కరీంనగర్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగానే ఉందని, 24గంటలు దాటితే కాని చెప్పలేమంటూ వైద్యులు చెబుతున్నారు. జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం వివిరావుపేట గ్రామానికి చెందిన గంగాదేవి కరీంనగర్ జిల్లా కేంద్రంలోని బాలసదన్‌లో ఆయాగా పనిచేస్తోంది. అయితే, విధులు సక్రమంగా నిర్వహించకపోవడంతో ఇటీవలే స్ర్తి శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్టు డైరెక్టర్‌కు ఆమెను సరేండర్ చేశారు. అయితే, తనకు తిరిగి అదే స్థానంలో పోస్టింగ్ ఇవ్వాలని కోరుతూ గంగాదేవి కలెక్టర్‌ను కలిసేందుకు వచ్చి కలెక్టర్‌ను కలువకుండానే ఈ అఘాయిత్యానికి పాల్పడింది. ఈ సంఘటనతో కలెక్టరేట్‌లో కొంత కలకలం రేపింది. ఈ సంఘటనపై విచారణ జరపాలని కలెక్టర్ సర్పరాజ్ అహ్మద్ అధికారులను ఆదేశించినట్లు సమాచారం. ఈ సంఘటనపై వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

చిత్రం.. హెయిర్ డై తాగిన మహిళను ఆసుపత్రికి తీసుకెళ్తున్న మహిళా పోలీసు