తెలంగాణ

సఖ్యతగానే ఉందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 21:విభజన సమస్యలు ఇంకా పరిష్కారం కాని ప్రస్తుత పరిస్థితిలో రాష్ట్రానికి సంబంధించిన ప్రయోజనాలే ముఖ్యంగా వ్యవహరించాలని ముఖ్యమంత్రి కెసిఆర్ భావిస్తున్నారు. మూడు రోజుల ఢిల్లీ పర్యటన ముగించుకుని కెసిఆర్ సోమవారం రాత్రి నగరానికి చేరుకున్నారు. ప్రధానమంత్రితో భేటీ అయిన తరువాత కెసిఆర్ ఢిల్లీలో మీడియాతో మాట్లాడకపోయినా తన వెంట వచ్చిన అధికారుల బృందంతో తరచూ సంప్రదింపులు జరుపుతూనే ఉన్నారు. ఉమ్మడి రాజధాని, సెక్షన్ 8, హైకోర్టు విభజన, ఆస్తుల పంపకాలు వంటి సమస్యలు ఇంకా పరిష్కారం కాని నేపథ్యంలో కేంద్రంతో ఘర్షణ వైఖరి అవలంబించే అవకాశం లేదనీ, వీటిన్నంటినీ దృష్టిలో పెట్టుకుని రాష్ట్రానికి మేలు జరిగే విధంగా కేంద్రంతో ఇచ్చిపుచ్చుకునే ధోరణితో వ్యవహరించడమే మంచిదనే అభిప్రాయాన్ని ముఖ్యమంత్రి సన్నిహితుల వద్ద వ్యక్తం చేసినట్టు తెలిసింది. ‘నల్లధనం నిర్మూలనకు గతంలో ఎలాంటి ప్రయత్నాలు చేయలేదు. నల్లధనం పెరిగిపోవడానికి పాలకులే అవకాశం కల్పించారు. పాతనోట్ల రద్దు నిర్మూలనకు ప్రధాని తీసుకున్నది సాహసోపేతమైన నిర్ణయం. అయితే ప్రజలకు ఇబ్బంది కలగకుండా ముందస్తుగా ఎలాంటి ఏర్పాట్లు చేయకపోవడంవల్ల ప్రజలు కష్టాలపాలు కావలసి వచ్చింద’ని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. నల్లధనం నిర్మూలనకు, ఇప్పుడు తలెత్తిన సమస్యల నివారణకు పలు సలహాలు ఇస్తే ప్రధానమంత్రి సానుకూలంగా స్పందించినట్టు సిఎం సహచరులవద్ద వ్యాఖ్యానించినట్టు తెలిసింది.