ఆంధ్రప్రదేశ్‌

మద్యం అమ్మకాల్లో అవినీతి కిక్కు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, నవంబర్ 23: రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో మద్యం అమ్మకాల్లో జరుగుతున్న భారీ దోపిడీ, అవినీతిపై బిజెపి దృష్టి సారించినట్లు కనిపిస్తోంది. అందులో భాగంగా ఎక్సైజ్ శాఖలో జరుగుతున్న అవినీతిపై గత కొంతకాలంగా అధ్యయనం చేస్తున్న బిజెపి శాసనమండలి సభ్యుడు, ఆ పార్టీ జాతీయ కార్యవర్గసభ్యుడయిన సోము వీర్రాజు మద్యం అమ్మకాల్లో వేల కోట్ల రూపాయల అవినీతి జరుగుతోందంటూ ముఖ్యమంత్రి చంద్రబాబుకు లేఖ రాశారు. రాష్ట్రంలో సుమారు కోటి మంది రోజూ మద్యం తాగుతున్నారని, వారినుంచి మద్యం దుకాణాలు రోజుకు 30 రూపాయలు అదనంగా వసూలు చేయడం వల్ల, రోజుకు రూ.30 కోట్లు చొప్పున నెలకు 900 కోట్లు, ఏడాదికి 10800 కోట్లు దళారీలు, అధికార వ్యవస్థ జేబుల్లోకి వెళుతోందని సోమువీర్రాజు తన లేఖలో సీఎం దృష్టికి తీసుకువెళ్లారు. ఈ సొమ్ము బ్లాక్‌మనీగా మారే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. రాజమహేంద్రవరం, కాకినాడ, విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లోని ఎక్సైజ్, ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులతో కూడా తాను చర్చించానని తన లేఖలో వివరించారు. మద్యం షాపులు ఉదయం 10కు తెరిచి రాత్రికి 10గంటలకి మూయాలని, మద్యాన్ని ఎంఆర్‌పికే అమ్మాలని, జాతీయ రహదారులపై షాపులు ఉండకూడదని, బెల్ట్‌షాపులు నిషేధించాలని, పర్మిట్‌రూముల పేరుతో మినీబార్లు వద్దని, ప్రధానంగా షాపులలో ప్లాస్టిక్ గ్లాసులు, వాటర్‌ప్యాకెట్లు అమ్మకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. ఇవన్నీ ప్రభుత్వ ఆదాయం దెబ్బతీసేవేనని వీర్రాజు స్పష్టం చేశారు.