తెలంగాణ

ప్రధాని మోదీ స్పందించారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 22: నోట్ల రద్దువల్ల రాష్ట్రాలు ఎదుర్కొంటున్న ఆర్థిక సంక్షోభం, సామాన్య ప్రజలు, రైతులు, అసంఘటిత వ్యాపారులు, చిరు వ్యాపారులకు తలెత్తిన ఇబ్బందులను ప్రధాని నరేంద్ర మోదీ దృష్టికి తీసుకెళ్లగా సానుకూలంగా స్పందించారని సిఎం కెసిఆర్ పేర్కొన్నారు. ఇబ్బందులు తొలగించడానికి కేంద్రం చర్యలు చేపట్టిందని గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్‌కు ఢిల్లీ పర్యటన విశేషాలను వివరించారు. నోట్ల రద్దు వల్ల రాష్ట్ర ఆదాయ వనరులు ఏవిధంగా దెబ్బతిన్నాయో వివరించడంతో అధ్యయనానికి కేంద్ర బృందాలను రాష్ట్రాలకు వెంటనే పంపించాల్సిందిగా ప్రధాని ఆదేశించారని గవర్నర్‌కు వివరించారు. నోట్ల రద్దుతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వారికి కొంత వెసులుబాటు కల్పించాలని సూచించిన మేరకు కిసాన్ క్రెడిట్ కార్డుల నుంచి పరిమితి లేకుండా డబ్బులు విత్‌డ్రా చేసుకోవడానికి కేంద్రం అవకాశం కల్పించిందని గవర్నర్‌కు వివరించినట్టు తెలిసింది. నోట్ల రద్దు తర్వాత పడిపోయిన రాష్ట్ర ఆదాయ వివరాలు, ముఖ్యంగా రిజిస్ట్రేషన్స్, ట్రాన్స్‌పోర్టు, ఎక్సైజు శాఖకు తగ్గిన ఆదాయ పరిస్థితిని ప్రధానికి వివరించినట్టు గవర్నర్‌కు తెలిపారు. నోట్ల రద్దు నేపథ్యంలో ప్రభుత్వ ప్రాధాన్యతలలో చేర్పులు, మార్పులు చేసుకోవడానికి అధికారులు కసరత్తు చేస్తున్నట్టు కూడా సిఎం వివరించినట్టు తెలిసింది. ఆర్థికంగా ఇబ్బందులు తలెత్తినప్పటికీ ఉద్యోగులు, పెన్షనర్లకు వేతనాలను ఎప్పటి మాదిరిగానే చెల్లించడానికి చర్యలు తీసుకున్నట్టు వివరించారు. క్యాంపు కార్యాలయ నిర్మాణం పూర్తి కావడంతో ఈనెల 24న గృహ ప్రవేశం చేయడంతోపాటు త్వరలో కలెక్టర్లతో సమావేశం నిర్వహించనున్నట్టు కూడా గవర్నర్‌కు ముఖ్యమంత్రి చెప్పినట్టు సమాచారం.

చిత్రం.. ఢిల్లీ పర్యటన విశేషాలను గవర్నర్ నరసింహన్‌కు వివరిస్తున్న సిఎం కెసిఆర్