తెలంగాణ

స్టేట్‌బ్యాంక్‌కు కొత్త నోట్లు ఫుల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 22: పెద్ద నోట్ల రద్దు నిర్ణయం తర్వాత ఎస్‌బిఐ, ఎస్‌బిహెచ్‌లకు కొత్త కరెన్సీ కట్టలు వచ్చిపడుతుండగా, ఇతర బ్యాంకులు నగదు లేక వెలవెలపోతున్నాయి. వారంలో 24 వేల రూపాయల వరకు విత్‌డ్రా చేసుకునే సౌకర్యం కల్పించినప్పటికీ, ఈ విధానం ఎస్‌బిఐ, ఎస్‌బిహెచ్‌లలోనే అమలవుతోంది. తెలంగాణ రాష్ట్రంలో ఎస్‌బిఐ, ఎస్‌బిహెచ్‌లతో పాటు ఆంధ్రబ్యాంక్, ఐడిబిఐ, పంజాబ్ నేషనల్ బ్యాంక్, బిఓబి, కరూర్ వైశ్యాబ్యాంక్ తదితర పబ్లిక్ సెక్టార్ బ్యాంకులు 25 వరకు ఉన్నాయి. అలాగే యాక్సిస్, ఐసిఐసిఐ తదితర ప్రైవేట్ బ్యాంకులు 19 వరకు ఉన్నాయి. ఇవికాకుండా రెండు గ్రామీణ బ్యాంకులు (టిజిబి, ఎపిజివిబి), రెండు సహకార బ్యాంకులు (టెస్కాప్, మహేశ్) ఉన్నాయి. రాష్ట్రం మొత్తంలో అన్ని బ్యాంకులకు కలిపి 5,212 శాఖలుండగా, వీటిలో 25 శాతం స్టేట్ బ్యాంక్ శాఖలు కాగా, మిగతావి ఇతర బ్యాంకుల శాఖలున్నాయి. ఈ బ్యాంకుల్లో ప్రస్తుతం ప్రజలు 3,63,000 కోట్ల రూపాయలను డిపాజిట్లుగా దాచుకున్నారు. ఈ మొత్తాన్ని ప్రజలు విత్‌డ్రా చేసుకోవడం లేదు కానీ, ఉద్యోగులు, సామాన్యులు తదితరులు తమ అవసరాలకు సేవింగ్స్ నుండి డబ్బును విత్‌డ్రా చేసుకోవాలన్నా కుదరడం లేదు. స్టేట్‌బ్యాంకులకు ఆర్‌బిఐ నుండి వస్తున్న విధంగా, ఇతర బ్యాంకులకు కొత్త కరెన్సీ చేరడం లేదు. దాంతో ఇతర బ్యాంకుల కస్టమర్లు ఇక్కట్లకు గురవుతుండగా, స్టేట్ బ్యాంక్ కస్టమర్లకు వెసులుబాటు లభిస్తోంది. ఐసిఐసిఐ తదితర బ్యాంకుల ముందు బారులు తీరిన వారిలో కొద్దిమందికి మాత్రమే ఒకే పర్యాయం రెండువేలు, నాలుగువేల రూపాయల వరకే ఇస్తున్నాయి. అన్ని బ్యాంకులను ఆర్‌బిఐ సమానంగా ఎందుకు చూడటం లేదన్న ప్రశ్న ఉద్భవిస్తోంది.