తెలంగాణ

వర్గీకరణకు కేంద్రంలో అడ్డుపడుతున్నారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్/చార్మినార్, నవంబర్ 22: కేంద్ర మంత్రి రాందాస్ అత్వాలే, విపక్ష నేత మల్లిఖార్జున్ ఖార్గేలు ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణకు అడ్డుపడుతున్నారని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ ఆరోపించారు. మంగళవారం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో డప్పోల్ల రమేష్ రచించిన ‘చిటిక కోలా దండోర’ వర్గీకరణ ఉద్యమ దీర్ఘ కవిత అనే పుస్తకావిష్కరణ సభ జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన మందకృష్ణ పుస్తకావిష్కరణ గావించినానంతరం మాట్లాడుతూ వర్గీకరణ బిల్లును పార్లమెంటు అడ్డుకోవాలని మాలలు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. బిజెపి, కాంగ్రెస్‌లు వర్గీకరణకు అనుకూలంగా ఉన్నా, కేంద్ర మంత్రి రాందాస్ అత్వాలే, విపక్ష నేత మల్లిఖార్జున్ ఖార్గేలు అడ్డుకోవాలని చూస్తున్నారని అన్నారు. మాదిగలంతా సంఘటితం చేసి వర్గీకరణను సాధించుకుని తీరుతామని అన్నారు. ఈ నెల 27న సికిందరాబాద్ పరేడ్‌గ్రౌండ్స్‌లో నిర్వహించనున్న వర్గీకరణ ధర్మయుద్ధం మహాసభకు కవులు, కళాకారులు, రచయితలు ఏకమై రావాలని పిలుపునిచ్చారు. ద్రవిడ విశ్వవిద్యాలయ అధ్యాపకులు ఇనాక్, మాజీ ఉప ముఖ్యమంత్రి టి. రాజయ్య, రచయిత, రచయిత్రులు సుభద్ర, జి. శ్యామల, శ్రీనివాస్, లక్ష్మినర్సయ్య, మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.