తెలంగాణ

రబీ ప్లాన్ రెడీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 28: రబీ సాగుకు నీటి విడుదల ప్రణాళికను నీటిపారుదల శాఖ ఖరారు చేసి సోమవారం ప్రకటించింది. ప్రాజెక్టుల వారీగా సాగు చేసే ఆయకట్టు, వాటికి అవసరమైన నీటి కేటాయింపులను నీటిపారుదలశాఖ ముఖ్య కార్యదర్శి ఎస్‌కె జోషి ప్రకటించారు. ఈమేరకు అధికారిక ఉత్తర్వులను విడుదల చేశారు. రాష్టస్థ్రాయి సమగ్ర నీటి ప్రణాళిక మరియు యాజమాన్య కమిటీ (ఎస్‌సిఐడబ్ల్యుఎఎం) ఈనెల 2న సమావేశమై 2016-17 సంవత్సరానికి ప్రతిపాదించిన రబీ సాగునీటి ప్రణాళికను ఆమోదించినట్టు ఉత్తర్వులలో పేర్కొన్నారు. శ్రీరామ్‌సాగర్ ప్రాజెక్టు కింద 4,62,920 ఎకరాల ఆయకట్టు ఉండగా ప్రస్తుతం ప్రాజెక్టులో 88.66 టిఎంసిల నీరు నిలువ ఉండగా ఇందులో 40 టిఎంసిలు రబీకి కేటాయించింది. నాగార్జునసాగర్ ప్రాజెక్టు కింద రబీకి 5,40,391 ఎకరాలు ఖరారు చేసి 50 టిఎంసిలు, ఎఎంఆర్ శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ కింద 2,60,616 ఎకరాలను ఖరారు చేసి 15 టిఎంసిలు, హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ బోర్డుకు 10 టిఎంసిలు కేటాయించింది. లోయర్ మానేరు డ్యామ్‌లో (ఎల్‌ఎండి) ప్రస్తుతం 21 టిఎంసిల నీరు ఉండగా ఎగువ ఎస్‌ఆర్‌ఎస్‌పి నుంచి వచ్చే నీటితో కలిసి 32 టిఎంసిలు కేటాయించి రబీలో 415640 ఎకరాల ఆయకట్టు ఖరారు చేసింది. కడెం ప్రాజెక్టులో ప్రస్తుతం 6.90 టిఎంసిల నీరు ఉండగా ఇందులో రబీకి 4 టిఎంసిలు కేటాయించి 37000 ఎకరాలను ఖరారు చేసింది. నిజాంసాగర్, అలీసాగర్, ఎఆర్‌ఆర్ ఎత్తిపోతల పథకం మూడింటిలో ప్రస్తుతం 17.80 టిఎంసిల నీరు ఉండగా రబీకి 208410 ఎకరాలను ఖరారు చేసి 11.80 టిఎంసిలు కేటాయించింది. సింగూరు ప్రాజెక్టు, ఎత్తిపోతల పథకాలు రెండింటి కింద రబీలో 30,000 ఎకరాలను ఖరారు చేసి 2 టిఎంసిల నీటిని కేటాయించింది. జూరాల ప్రాజెక్టు రబీలో 60,000 ఎకరాలను ఖరారు చేసి 5.244 టిఎంసిలను కేటాయించింది. వరంగల్ జిల్లా పాఖాల కింద రబీకి 11000 ఎకరాలు ఖరారు చేసి 2 టిఎంసిలు, రామప్ప కింద రబీలో 3500 ఎకరాలకు 0.64 టిఎంసిలు, లక్నవరం కింద రబీలో 6600 ఎకరాలకు 1.05 టిఎంసిలు కేటాయించింది. ఆదిలాబాద్ జిల్లాలోని 10 ప్రాజెక్టుల కింద రబీలో సాగుకు 81300 ఎకరాలను ఖరారు చేసి 8.466 టిఎంసిలు కేటాయించింది. ఖమ్మం జిల్లాలోని నాలుగు ప్రాజెక్టుల కింద రబీకి 26120 ఎకరాలను ఖరారు చేసి 4.65 టిఎంసిలు కేటాయించింది. కరీంనగర్ జిల్లాలోని శనిగరం, బొగ్గులవాగు, అప్పర్ మానేరు ప్రాజెక్టుల కింద 17385 ఎకరాలను రబీకి ఖరారు చేసి 2.72 టిఎంసిలు కేటాయించింది.