తెలంగాణ

సిబిఐ మాజీ డైరెక్టర్ కుమారుడిపై సిబిఐ కేసు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: సిబిఐ మాజీ డైరెక్టర్, మాజీ మంత్రి విజయరామారావు కుమారుడు కళ్యాణ శ్రీనివాసరావుపై సిబిఐ కేసు నమోదు చేసింది. పలు బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాల చెల్లింపులో విఫలమయ్యారన్న అభియోగాల కింద సిబిఐ అధికారులు కేసులు నమోదు చేశారు. సెంట్రల్ బ్యాంకు సహా పలు బ్యాంకుల నుంచి రూ.304 కోట్లు రుణాలు తీసుకొని తిరిగి చెల్లించలేదని ఆయా బ్యాంకుల అధికారులు సిబిఐకి ఫిర్యాదు చేశారు. ఈమేరకు సిబిఐ అధికారులు శ్రీనివాసరావు ఆస్తుల గుర్తింపు కోసం హైదరాబాద్, చెన్నైలోని నివాసాల్లో ఆకస్మిక సోదాలు నిర్వహించారు. హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ రోడ్డు నెం.4లోని స్టోన్ వాలీ అపార్టుమెంట్స్, చెన్నైలోని సుంగాంబక్కంలోని బెస్ట్ అండ్ క్రాంప్టన్ ఇంజనీరింగ్ ప్రాజెక్ట్సు లిమిటెడ్ కంపెనీలోనూ సోదాలు జరిగాయి. సెంట్రల్ బ్యాంక్ కార్పొరేట్ ఫైనాన్స్ బ్రాంచ్ అధికారి ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో రూ.124 కోట్లు, ఆంధ్ర బ్యాంకు నుంచి రూ.60 కోట్లు, కార్పొరేషన్ బ్యాంకు నుంచి రూ.120 కోట్లు రుణాలు పొందారని, తిరిగి చెల్లించలేదని బ్యాంకు అధికారులు ఫిర్యాదు చేసినట్టు సిబిఐ అధికారి ఒకరు తెలిపారు. బ్యాంకు రుణాల దుర్వినియోగంపై శ్రీనివాసరావుపై సెక్షన్ 120బి, 420, 468, 471 కింద పోలీసులు కేసు నమోదు చేశారు. శ్రీనివాసరావుతోపాటు మరో పదిమందిపై కేసులు నమోదు చేసినట్టు సిబిఐ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. కాగా వీరిని బెస్ట్ అండ్ క్రాంప్టన్ ఇంజనీరింగ్ ప్రాజెక్ట్సు లిమిటెడ్ కంపెనీ మెటీరియల్స్ కొనుగోళ్లపై సిబిఐ అధికారులు ప్రశ్నించనున్నారు.