తెలంగాణ

మలక్‌పేట గంజ్‌లో ఉద్రిక్తత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, చాదర్‌ఘాట్, డిసెంబర్ 1: మలక్‌పేటలోని వ్యవసాయ మార్కెట్ కార్యాలయంపై రైతులు గురువారం ఉదయం దాడికి పాల్పడ్డారు. ఈ సందర్భంగా కార్యాలయంలోని ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు. మిర్చి, ఉల్లికి గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేస్తూ రైతులు ఆందోళన చేపట్టారు. అనంతరం ఆన్‌లైన్ మార్కెట్‌పై అధికారులకు, రైతులు, గుమస్తాలు, కమీషన్ ఎజెంట్‌ల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో కోపోద్రిక్తులైన రైతులు మార్కెట్ కార్యాలయంపై దాడికి పాల్పడి ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు. అనంతరం పలువురు రైతులు అధికారుల పనితీరును నిరసిస్తూ ధర్నాకు దిగారు. కార్యాలయం ముందు అందోళనకు దిగిన రైతులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీంతో ఇక్కడ కొంతసేపు ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. మార్కెటింగ్ శాఖ అధికారులు తమను మోసం చేస్తున్నారని వీరిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ఆందోళనకు దిగిన రైతులు ఆరోపించారు. రైతుల పట్ల ప్రభుత్వం అదరాభిమానాలు చూపుతున్నా అధికారులు మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.
మలక్‌పేట్ వ్యవసాయ మార్కెట్ కార్యాలయం ముందు రైతులు ఆందోళనకు దిగడంతో మార్కెట్‌లోని లారీలు ఎక్కడిక్కడే ఆగిపోయ రాకపోకలకు తీవ్ర ఆటంకం ఏర్పాడింది. మాలక్‌పేట మార్కెట్ కార్యాలయం సెలెక్షన్ గ్రేడ్ కార్యదర్శి రాజశేఖర్‌రెడ్డి స్థానిక చాదర్‌ఘాట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ కార్యాలయంపై దాడికి పాల్పడిన 17 మందిపై ఐపిసి 120బి, 147, 290, 140 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు చాదర్‌ఘాట్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ సత్తయ్య తెలిపారు. ప్రభుత్వ కార్యాలయంపై మూకుమ్మడి దాడికి పాల్పడిన వారిని మరికొంత మందిని గుర్తించాల్సి ఉందని, వారికోసం గాలిస్తున్నామన్నారు.