తెలంగాణ

ఆస్తి పన్నుపై వడ్డీ మాఫీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: మహానగర పాలక సంస్థకు ప్రధాన ఆర్థిక వనరైన ఆస్తిపన్ను వసూళ్లపై సర్కారు ప్రత్యేక శ్రద్ధ చూపుతోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఆస్తిపన్నుపై వడ్డీ మాఫీ చేస్తూ, ఈసారి నెలరోజుల ముందే జీవో జారీ చేయటం ఇందుకు నిదర్శనం. ప్రతి ఆర్థిక సంవత్సరం జనవరి నుంచి పన్ను వసూలుపై పూర్తిస్థాయిలో దృష్టి సారించే అధికార యంత్రాంగం ఆదివారం, ఇతర సెలవురోజుల్లో కూడా విధులు నిర్వర్తించే వారు. అలాగే బకాయి ఉన్న ఆస్తిపన్నుపై సర్కారు వడ్డీని మాఫీ చేస్తూ ఇప్పటి వరకు మార్చి చివరి నాలుగైదు రోజుల్లో జీవోను జారీ చేసేది. కానీ ఈసారి నెలరోజుల ముందే జీవోను జారీ చేసి, కార్పొరేషన్‌కు సర్కారు సహాయాన్నందించింది. ఈ జీవో ప్రకారం వర్తమాన ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆస్తిపన్ను బకాయిల్లో వర్తమాన వడ్డీని మాఫీ చేయనున్నట్లు కమిషనర్ జనార్దన్‌రెడ్డి వెల్లడించారు. ఈ వడ్డీ మాఫీ ఆదేశాలతో గ్రేటర్‌లో ఆస్తిపన్ను చెల్లించే బకాయిదారులకు సుమారు రూ.532.57 కోట్ల వరకు లబ్ది చేకూరుతోందని తెలిపారు. ప్రస్తుతం జిహెచ్‌ఎంసికి రూ. 2వేల 78 కోట్ల ఆస్తిపన్ను రావాల్సి ఉండగా, వీటిలో రూ. 619.39 కోట్లు పాత బకాయిలున్నట్లు, దీనిలో రూ. 474.33 కోట్లు మాఫీ చేయాల్సిన వడ్డీ ఉందని వివరించారు. ఇందులో రూ.1200లోపు పన్ను చెల్లించే బకాయిదారులకు సిఎం రూ.101కు కుదింపు చేస్తూ ప్రకటించటంతో రూ. 85.63 కోట్లు మాఫీ చేయటం జరిగిందని, దీనివల్ల 5 లక్షల 5వేల 171 మందికి లబ్ది చేకూరుతోందని తెలిపారు. మొత్తం 532.57 కోట్లు మాఫీ చేసినట్లు వివరించారు. ప్రభుత్వం ఈసారి కాస్త ముందుగానే వడ్డీ మాఫీ ఆఫర్ ఇచ్చినందున, ప్రజలు సకాలంలో పన్నులు చెల్లించి నగరాభివృద్ధిలో భాగస్వాములు కావాలని కమిషనర్ కోరారు. బకాయిదారులు పన్ను చెల్లించేందుకు గ్రేటర్‌లోని 24 సర్కిళ్లలోని 19 పౌరసేవ కేంద్రాలు, వివిధ బ్యాంకులకు చెందిన 560 బ్యాంకు బ్రాంచీల్లోగానీ, మీ సేవా కేంద్రాల్లోగానీ, లేక మీ ఇంటికి వచ్చే బిల్ కలెక్టర్లు, ట్యాక్సు ఇన్‌స్పెక్టర్లకు గానీ పన్ను చెల్లించి రసీదు పోందాలని కమిషనర్ సూచించారు.
ఇప్పటికే చెల్లించనట్లయితే..!
వర్తమాన ఆర్థిక సంవత్సరం ఇప్పటికే కరెంటు డిమాండ్‌తో పాటు వడ్డీని కూడా చెల్లించిన బకాయిదారులకు వచ్చే ఆర్థిక సంవత్సరం విధించనున్న ఆస్తిపన్నులో సర్దుబాటు కల్పిస్తామని కమిషనర్ జనార్దన్ రెడ్డి ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.