తెలంగాణ

కార్మిక పక్షపాతి కెసిఆర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 2: ముఖ్యమంత్రి కెసిఆర్ నాయకత్వంలోని ప్రభుత్వం కార్మిక , ఉద్యోగుల పక్షపాతి అని మరోసారి రుజువైందని తెలంగాణ రాష్ట్ర విద్యుత్ కార్మిక సంఘం అధ్యక్షులు కె సత్యనారాయణరావు, ప్రధాన కార్యదర్శి కోడూరి ప్రకాష్ పేర్కొన్నారు. విద్యుత్ శాఖలవ పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు వారు చెప్పారు. శుక్రవారం సచివాలయంలో విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డిని కలిసి ప్రభుత్వం నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేశారు. మంత్రికి పుష్పగుచ్చాలు ఇచ్చారు. తెలంగాణ రాష్ట్ర విద్యుత్ ఇంజనీర్ల సంఘంతో పాటు మరికొన్ని సంఘాలు సమ్మెకు దూరంగా ఉన్నాయన్నారు. అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను దరఖాస్తుల తోటి క్రమబద్ధీకరణకు పభుత్వం నిర్ణయించడం చారిత్రాత్మకమన్నారు. మంత్రిని కలిసిన వారిలో ఎస్‌పిడిసిఎల్ కంపెనీ కార్మిక ప్రతినిదులు కూడా ఉన్నారు.