తెలంగాణ

బాల్యవివాహాలను అడ్డుకున్నాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 2: తెలంగాణ రాష్ట్రంలో 2886 బాల్యవివాహాలను నిలిపివేసి వారి సంరక్షణ, భద్రతకు అవసరమైన చర్యలు తీసుకున్నట్లు రాష్ట్ర మహిళా సంక్షేమ శాఖ ప్రకటించింది. త్వరలో మహిళా హెల్ప్‌లైన్ 181ను రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్నారు. పిల్లల దత్తత ప్రక్రియ సరళీకృతం చేశామని, 449 మంది పిల్లలను దత్తతకు ఇచ్చామని, 45 మంది పిల్లలను విదేశీయులకు దత్తతకు ఇచ్చినట్లు ఆ శాఖ పేర్కొంది. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత రెండున్నర సంవత్సరాల్లో అమలు చేసిన కార్యక్రమాలపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శే్వతపత్రం ప్రకటించారు. శిశులింగ నిర్ధారణ దుర్వినియోగం కేసులను గుర్తించి పాక్సో చట్టం కింద కేసులను నమోదు చేశారు. జిల్లాల్లో గృహహింస చట్టం కింద సేవలు అందిస్తున్న విభాగాలకు బాధితుల నుంచి 8690 పిటిషన్లు అందాయి. దీనికి సంబంధించి 6393 గృహ సంబంధ నివేదికలను దాఖలు చేశారు. 555 కేసుల్లో మధ్యంతర ఉత్తర్వులను జారీ చేశారు. 1570 కేసుల్లో తుది ఉత్తర్వులను జారీ చేశారు. కౌనె్సలింగ్ ద్వారా 1334 కేసులను పరిష్కరించారు. హింసకు గురైన మహిళలకు సహాయం అందించేందుకు సఖి సెంటర్లను ఇంతవరకు పది జిల్లాల్లో ఏర్పాటు చేశారు. 517 లైంగిక వేధింపులు, 3640 గృహహింస కేసులు నమోదు చేశారు. షీ టాక్సీకింద మొత్తం 18 మంది మహిళా డ్రైవర్లను ఎంపిక చేసి వాహనాలను సమకూర్చారు. హైదరాబాద్‌లో పోలీసు అధికారులతో నిర్వహిస్తున్న భరోసా కేంద్రానికి రూ.2 కోట్ల నిధులు మంజూరు చేశారు. లైంగికవేధింపులు, అక్రమ రవాణా, వరకట్న మరణాలు వంటి ద్వారా బాధితులైన మహిళలు, బాలికల పునరావాసం కోసం రూ.2.24 కోట్లు మంజూరు చేశారు. మహిళా సాధికారత కోసం భారత ప్రభుత్వం మంజూరు చేసిన పూర్ణ శక్తి కేంద్రప్రాజెక్టును నల్లగొండ జిల్లాలోని దేవరకొండ మండలానికి మంజూరు చేశారు. కొత్త జిల్లాల ఆవిర్భావంతో ఐసిడిఎస్ ప్రాజెక్టును పునర్వ్యవస్థీకరణ చేస్తున్నారు. డిసెంబర్ మూడ వారం నుంచి శిశుసంక్షేమ శాఖాధికారులకు సేఫ్టీ, సెక్యూరిటీ శిక్షణ ఇస్తారు. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు స్వచ్ఛంద సంస్ధలు నిర్వహిస్తున్న ఏడు గృహాలను తాత్కాలిక బాలుర పరిశీలన గృహాలుగా ఆదిలాబాద్, కరీంనగర్, మెదక్, నల్లగొండ, మహబూబ్‌నగర్, ఖమ్మం, రంగారెడ్డి జిల్లాల్లో ధృవీకరించారు. మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖలో 9 సదనాలను బాలికల పరిశీలన గృహాలుగా ధ్రువీకరించారు.