తెలంగాణ

16నుండి అంతర్జాతీయ వైద్యుల సదస్సు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నార్కట్‌పల్లి, డిసెంబర్ 2: జెనెటిక్ మాలిక్యులర్ డయాగ్నసిస్ ఇన్ మోడ్రన్ మెడిసిన్ పేరుతో అంతర్జాతీయ వైద్యుల సమ్మేళనం తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి మండల కేంద్రంలో ఈనెల 16 నుంచి నిర్వహించనున్నట్లు కామినేని వైద్యుల బృందం పేర్కొంది. శుక్రవారం వైద్య కళాశాల ఆవరణలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆర్గనైజింగ్ కమిటీ చైర్మన్, డాక్టర్ శృతిమహంతి, కమిటీ సభ్యులు మాట్లాడుతూ సమ్మేళన లక్ష్యాలు, ఉద్దేశ్యాలను వివరించారు. తొలిసారిగా తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అంతర్జాతీయ సమ్మేళనానికి పెద్ద ఎత్తున డెలిగేట్స్ హాజరవుతున్నారని ఇప్పటివరకు మహా నగరాలల్లోనే జరిగే ఈ తరహా సమావేశాలు గ్రామీణ ప్రాంతాల్లో కూడా నిర్వహించవచ్చన్న సంకేతాలను వైద్య రంగానికి తెలియజెప్పాలన్న దృఢ సంకల్పంతో కామినేని వైద్యులు యాజమాన్యం సహకారంతో జెనెటిక్ మాలిక్యులర్ డయాగ్నసిస్ ఇన్ మోడ్రన్ మెడిసిన్ 2016ను నిర్వహించేందుకు ముందుకు వచ్చామని పేర్కొన్నారు. ఈ బృహత్తర కార్యక్రమానికి ఇప్పటికే మంచి స్పందన లభించిందని, వివిధ దేశాలు, దేశంలోని ప్రముఖ వైద్యులు, శాస్తవ్రేత్తలు 300మందికి పైగా హాజరుకావడానికి పేర్లు నమోదు చేసుకున్నారని వివరించారు.

చిత్రం..అంతర్జాతీయ వైద్యుల సదస్సు వివరాలను వెల్లడిస్తున్న వైద్యబృందం