ఆంధ్రప్రదేశ్‌

అంగరంగ వైభవంగా అమ్మవారి రథోత్సవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, డిసెంబర్ 3: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో భాగంగా 8వ రోజైన శనివారం ఉదయం శ్రీ పద్మావతి అమ్మవారు విశేష అలంకరణ భూషితురాలై రథాన్ని అధిరోహించి ఆలయ నాలుగు మాడవీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. ఓవైపు వర్షం కురుస్తున్నా భక్తులు గోవిందనామ స్మరణచేస్తూ రథాన్ని ముందుకు లాగి తమ భక్తిని చాటుకున్నారు. నాలుగు మాడవీధుల్లో కూడా భక్తులు వర్షంలో తడుస్తూనే రథోత్సవాన్ని తిలకిస్తూ కర్పూర రతులు పట్టి భక్తిపారవశ్యంతో పులకించారు. మధ్యాహ్నం 1 నుంచి 2 గంటల వరకు రథ మండపంలో అమ్మవారికి శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకు ఊంజల్ సేవ నిర్వహించారు. రాత్రి 8 గంటలకు పద్మావతి అమ్మవారు కల్కి అవతారంలో అశ్వవాహనాన్ని అధిరోహించి ఆలయ మాడవీధుల్లో విహరించారు.