తెలంగాణ

కాంగ్రెస్‌ది అసూయ దీక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిద్దిపేట, డిసెంబర్ 3: టిఆర్‌ఎస్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో ఇతర రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకుంటే కాంగ్రెస్ నేతలు మాత్రం ఓర్వలేక విమర్శలు చేస్తున్నారని నీటి పారుదల శాఖమంత్రి హరీశ్‌రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. హామీల అమలుకోసం కాంగ్రెస్ నేతలు ఈనెల 5న దీక్ష చేస్తామని ప్రకటించడం దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని విమర్శించారు. టిఆర్‌ఎస్ పై విమర్శలు చేయడం సూర్యుని మీద ఉమ్మివేయడమేనన్నారు. జిల్లాకేంద్రమైన సిద్దిపేట ఆర్‌అండ్‌బి గెస్టుహౌజ్‌లో శనివారం రాత్రి జరిగిన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. టిఆర్‌ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు మంచిపేరు వస్తుంటే కాంగ్రెస్ నేతలు ఓర్వలేక అసూయదీక్ష చేస్తున్నారని దుయ్యబట్టారు.