తెలంగాణ

నవ్వులాటగా పెద్ద నోట్ల రద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 3: పెద్ద నోట్ల రద్దు వ్యవహారం నవ్వులాటగా మారిందని ఎఐసిసి అధికార ప్రతినిధి, రాజ్యసభ సభ్యుడు అభిషేక్ సింఘ్వి విమర్శించారు. ప్రధాని నరేంద్ర మోదీ దేశాన్ని క్యాష్‌లెస్ కాదు జాబ్ లెస్‌గా మారుస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. శనివారం హైదరాబాద్‌కు వచ్చిన అభిషేక్ సింఘ్వి గాంధీభవన్‌లో టి.పిసిసి అధ్యక్షుడు ఎన్. ఉత్తమ్‌కుమార్ రెడ్డి, పార్టీ నాయకులు మల్లు రవి, దాసోజు శ్రవణ్ తదితరులతో కలిసి విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ పెద్ద నోట్లను రద్దు చేస్తూ ప్రధాని మోదీ తీసుకున్న తుగ్లక్ నిర్ణయం వల్ల 80 మంది మరణించారని చెప్పారు. 24 రోజుల్లో 105 సార్లు మార్పులు చేశారని ఆయన తెలిపారు. 50 రోజుల తర్వాత అన్నీ సర్దుకుంటాయని, మంచి రోజులు వస్తాయని ప్రధాని చెప్పడాన్ని ఆయన ప్రస్తావిస్తూ ఈ గందరగోళ పరిస్థితులు చక్కబడడానికి కనీసం ఆరేడు నెలలు పడుతుందని అన్నారు. 50 రోజుల తర్వాత సత్ఫలితాలు కాదు దుష్పరిణామాలు వస్తాయని ఆయన తెలిపారు. ఇప్పటికే దేశంలో అప్రకటిత ఆర్థిక ఎమర్జెన్నీ నెలకొందని ఆయన చెప్పారు. భారత్‌ను క్యాష్‌లెస్‌గా మారుస్తామని ప్రధాని చెప్పారని, అయితే గుజరాత్, హర్యానా, ఉత్తర ప్రదేశ్‌లో తదితర రాష్ట్రాల్లో అనేక సంస్ధలు డబ్బులకు ఇవ్వలేక ఉద్యోగులను తొలగిస్తున్నాయని, తల్లడిల్లుతున్న వారు పొరుగు రాష్ట్రాలకు వలస వెళుతున్నారని, దీంతో జాబ్‌లెస్ భారత్‌గా మారుతున్నదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం అన్నీ చూస్తున్నా, వింటున్నా కనబడనట్లు, వినపడనట్లు నటిస్తున్నదని అభిషేక్ విమర్శించారు.
ప్రధాని సెల్ఫ్ గోల్..
దేశ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆయన తెలిపారు. ప్రధాని, ఆర్థిక మంత్రి జైట్లీ పరస్పర విరుద్ధమైన ప్రకటనలు చేస్తున్నారని ఆయన చెప్పారు. గతంలో ఏ ప్రధాని చేసుకోని విధంగా మోదీ సెల్ఫ్ గోల్ చేసుకున్నారని ఆయన అన్నారు. నోట్ల రద్దు చేస్తే ఎదురయ్యే పరిణామాలు ఏమిటో అంచనా వేయకుండా నిర్ణయం తీసుకున్నారని ఆయన తెలిపారు. దేశ ప్రజలపై ఇది క్రూరమైన దాడి అని అన్ని నివేదికలు వెల్లడించాయని అన్నారు. జిడిపి 2 శాతానికి పడిపోయినట్లు వెల్లడైందని ఆయన తెలిపారు. క్యాష్‌లెస్ అంటే దేశ ప్రజల్లో 2 శాతమే స్వైపింగ్‌కు అవకాశం ఉందని, మిగతా 98 శాతం లావాదేవీలు నగదు రూపంలోనే జరుగుతున్నాయని ఆయన వివరించారు. డబ్బులు కావాలంటూ ఎపి ముఖ్యమంత్రి ఆర్‌బిఐని కోరమే ఇందుకు ఉదాహరణ అని ఆయన చెప్పారు. పెద్ద నోట్ల రద్దు వల్ల నాలుగైదు లక్షల కోట్ల రూపాయలు చిత్తు కాగితాలుగా మిగిలిపోతాయంటే, ఇప్పటికే 10 లక్షల కోట్ల రూపాయలు వచ్చాయని, మరో 20 రోజుల్లో నాలుగైదు లక్షల కోట్ల రూపాయలు వచ్చే అవకాశం ఉందని అన్నారు. 400 కోట్ల నకిలీ నోట్ల కోసం 15 లక్షల కోట్లను రద్దు చేశారని ఒక సంస్థ పేర్కొందని ఆయన తెలిపారు. టోల్ ప్లాజాలు, ఇతర పన్నుల రూపేణా 1.28 వేల కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని, దీనికి బాధ్యులు ఎవరని ఆయన ప్రశ్నించారు. జన్‌ధన్ అకౌంట్లు ప్రారంభించినప్పుడు ఖాతాల్లో 25.2 కోట్ల రూపాయలు ఉంటే, పెద్ద నోట్ల రద్దు తర్వాత 64 వేల కోట్ల రూపాయలకు ఎలా పెరిగిందని అన్నారు. ఈ గందరగోళంపై జెపిసి లేదా సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి ద్వారా సమగ్ర విచారణ జరిపించాలని సింఘ్వి డిమాండ్ చేశారు. అన్ని రాష్ట్రాల్లోని బిజెపి ఆఫీసుల అకౌంట్లు, ఆ పార్టీ జిల్లాకార్యాలయాల అకౌంట్లపై కూడా విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు.