తెలంగాణ

నోట్ల మార్పిడి కేసులో పోలీస్ అధికారి అరెస్టు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్/ఖైరతాబాద్, డిసెంబర్ 3: నోట్ల మార్పిడి కేసులో ఓ పోలీస్ అధికారి సహా ముగ్గురు కానిస్టేబుళ్లను బంజారాహిల్స్ పోలీసులు అరెస్టు చేసి విచారిస్తున్నట్టు సమాచారం. వివరాల్లోకి వెళితే... బంజారాహిల్స్ ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ మంత్రి అనుచరుడు తిరుమలేష్ నాయుడు పాత నోట్లకు బదులు కొత్త నోట్లు ఇస్తే 20 శాతం కమీషన్ ఇస్తామని ఆశ చూపాడు. అదేవిధంగా కొత్త నోట్లకు తక్కువ ధరకే బంగారం సైతం ఇప్పిస్తామని నమ్మబలికాడు. ఇతని మాటలు నమ్మిన ఇరు రాష్ట్రాలకు చెందిన వారు నగదుతో నగరానికి చేరుకున్నారు. అతను పథకంప్రకారం ఫిలింనగర్‌లోని ఓ గెస్ట్‌హౌస్‌కు రప్పించి వారిని మాటల్లోకి దించుతాడు. ఈ లోగా ఒప్పందం ప్రకారం... పోలీస్ అధికారి సిబ్బందితో నేరుగా గెస్ట్‌హౌస్‌కు చేరుకొని తుపాకితో బెదిరింపులకు గురిచేస్తారు. వారి వద్ద నుంచి నగదును లాక్కొని అక్కడి నుంచి పంపించి వేస్తారు. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే కేసులు ఎదుర్కొవాల్సి వస్తుందని హెచ్చరిస్తారు. వీరి చేతిలో మోసపోయిన బాధితుడు లక్ష్మణ్ అగర్వాల్ బంజారాహిల్స్ పోలీసుల్ని ఆశ్రయించాడు. ఈమేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రధాన నిందితుడు తిరుమలేష్‌తో పాటు అతనికి సహరించిన పోలీస్ అధికారి, కానిస్టేబుళ్లు, మరో ఇద్దర్ని అరెస్టు చేసినట్టు తెలుస్తోంది. గతంలో కూడా సదరు అధికారి ఓ కేసు విషయంలో డబ్బులు తీసుకుంటూ ఏసిబికి పట్టుబడటంతో ప్రస్తుతం సిఎం క్యాంప్ కార్యాలయానికి ఎటాచ్ చేశారు.