తెలంగాణ

తక్కువ ధరకు బంగారం ఇస్తామంటూ మోసం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 3: తక్కువ ధరకే బంగారం ఇస్తామంటూ మోసం చేసే వారిని వెంటాడి, వేటాడి పట్టుకోవాల్సిన పోలీసులే ఓ రాజకీయ నేతతో కుమ్మక్కై తక్కువ ధరకే బంగారం ఇస్తామంటూ వ్యాపారులను మోసగించిన సంఘటన హైదరాబాద్ నగరంలోని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. బంజారాహిల్స్ పరిధిలోని కాంగ్రెస్ నేత ఒకరు తక్కువ ధరకే బంగారం ఇస్తానని వ్యాపారులకు ఆశ చూపాడు. కొత్త నోట్లు తీసుకుని ఫిలింనగర్ గెస్ట్‌హౌస్‌కు రావాలని కొందరికి సూచించాడు. దీంతో వ్యాపారులు భారీ నగదుతో రాగానే సదరు కాంగ్రెస్ నేత తనకు అనుకూలమైన ఓ సర్కిల్ ఇన్‌స్పెక్టర్‌కు సమాచారం అందించాడు. అక్కడికి చేరుకున్న సిఐ, మరో ఇద్దరు కానిస్టేబుళ్లు వ్యాపారుల వద్ద ఉన్న రూ. 30 లక్షల నగదు తీసుకెళ్లారు. కాంగ్రెస్ నేత, సిఐ కుమ్మక్కై తమ వద్ద ఉన్న నగదును దోచుకున్నారని వ్యాపారులు లబోదిబోమంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు కాంగ్రెస్ నేత, సిఐ, ఇద్దరు కానిస్టేబుళ్లను పోలీసు ఉన్నతాధికారులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం.