తెలంగాణ

ప్రజాస్వామిక తెలంగాణను సాధిస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 3: ‘ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి..తెలంగాణను సాధించాం..మన తెలంగాణను మనమే పాలిస్తాం..మనమే ప్రజాస్వామిక తెలంగాణను సాధిస్తాం’ అని తెలంగాణ రాజకీయ జెఎసి చైర్మన్ ప్రొఫెసర్ ఎం.కోదండరాం స్పష్టం చేశారు. సెర్చ్ వారెంట్ లేకుండా ప్రజాగాయని విమలక్క అరుణోదయ సాంస్కృతిక మండలి కార్యాలయంలో సోదాలు నిర్వహించటమే కాకుండా సాధారణ పుస్తకాలను స్వాధీనం చేసుకుని సీజ్ జేయటం దుర్మార్గమన్నారు. తక్షణమే అరుణోదయ కార్యాలయాన్ని తెరవాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రచయితల వేదిక, తెలంగాణ న్యాయవాద జెఎసి నిర్వహణలో పృథ్వి చక్రవర్తి దర్శకత్వం వహించిన ‘మలిదశ తెలంగాణ ఉద్యమంలో న్యాయవాదుల పోరాటం’ డాక్యుమెంటరీ ప్రదర్శన, సిడి విడుదల సభ శనివారం రాత్రి బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో జరిగింది. న్యాయవాద జెఎసి అధ్యక్షుడు బి.కొండారెడ్డి అధ్యక్షతన జరిగిన సభకు కోదండరాం ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. తెలంగాణ ప్రజాస్వామిక తెలంగాణగా ఎదగాలని కోరుకున్నాం కానీ ప్రభుత్వం ఇలా వ్యవహరిస్తే అయ్యే పనికాదు, భవిష్యత్తులో ఇలాంటి పరిణామాలు పునరావృతం కాకూడదని హెచ్చరించారు. విద్యార్థులనుండి ప్రారంభమైన మలిదశ పోరాట ఉద్యమానికి న్యాయవాదులు చివరివరకు వెన్నుదన్నుగా నిలవటం చారిత్రాత్మకమన్నారు. రిటైర్డ్ జస్టిస్ బి.చంద్రకుమార్ మాట్లాడుతూ ప్రజలు ఆకాంక్షించిన తెలంగాణ వేరు, అనుభవిస్తున్న తెలంగాణ వేరన్నారు.ప్రజాస్వామిక విలువలు పతనమవుతున్న వేళ మళ్లీ మంచి పాత్ర పోషించాల్సిన చారిత్రాత్మక సమయం ఆసన్నమయ్యిందన్నారు. తెలంగాణ రచయితల వేదిక అధ్యక్షుడు ప్రొఫెసర్ జయధీర్ తిరుమల రావు మాట్లాడుతూ తెలంగాణలో నిశ్శబ్ద పాలన కొనసాగుతుందన్నారు. సర్జికల్ దాడుల మాదిరిగా ప్రజలపై దాడులు జరుగుతున్నాయని, అన్ని వర్గాలు ఐక్యమై తిప్పికొట్టాల్సిన సమయం వచ్చిందన్నారు. కోదండరాంపై చేసిన వాఖ్యలను ఉపసంహరించుకోవాలన్నారు. కాగా,ప్రజాగాయని విమలక్క ప్రసంగానికి ముందు కంటతడి పెట్టుకున్నారు. ఎప్పుడూ సందడిగా ఉండే అరుణోదయ కార్యాలయానికి ఇన్ని సంవత్సరాల్లో ఎన్నడూ తాళం పడలేదని అందుకే బాధ అనిపించింది, కానీ భయం కాదన్నారు. ఆఫీసుకు తాళాలు వేయొచ్చు కానీ తమ గొంతుకకు వేయలేరనీ, ఆట, మాట, మాటతో ప్రజల్లోకెళ్తామన్నారు. కార్యక్రమంలో ప్రజాగాయకుడు గోరటి వెంకన్న, పాత్రికేయుడు పాశం యాదగిరి, న్యాయవాద జెఎసి కో-కన్వీనర్లు ప్రహ్లాద్, వి.రఘునాథ్, జె.లింగయ్య పాల్గొన్నారు.