తెలంగాణ

శ్రీకాంత్‌చారి త్యాగం చరిత్రలో నిలిచిపోతుంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మోత్కూరు, డిసెంబర్ 3 : తెలంగాణ మలిదశ ఉద్యమంలో తొలి అమరుడు కాసోజు శ్రీకాంత్‌చారి తెలంగాణ రాష్ట్ర సాధనకు చేసిన త్యాగం చిరస్మరణీయమని, చరిత్రలో నిలిచిపోతుందని తెలంగాణ రాష్ట్ర హోంశాఖ, కార్మిక శాఖామంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు. శనివారం నల్లగొండ జిల్లాలోని శ్రీకాంత్‌చారి స్వగ్రామం పొడిచేడు గ్రామంలో శ్రీకాంత్‌చారి 7వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ముఖ్య అతిథిగా పాల్గొన్న హోం మంత్రి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం తమ ప్రభుత్వం ఉన్నంతవరకు శ్రీకాంత్‌చారిని మరువలేమన్నారు. శ్రీకాంతాచారి ఆత్మబలిదానంతోనే తెలంగాణ ఉద్యమం ఊపందుకుందన్నారు. ఉద్యమచరిత్రలో ముఖ్యమంత్రి కేసి ఆర్‌కు మొదటి స్ధానం ఉంటే రెండవ స్ధానం శ్రీకాంతాచారికే దక్కుతుందన్నారు. అనంతరం రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి మాట్లాడుతూ శ్రీకాంతాచారి అమరత్వం ఎప్పటికీ చరిత్రలో నిలిచిపోతుందన్నారు. ముఖ్యమంత్రి కేసిఆర్ అన్ని వర్గాల వారికి న్యాయం జరిగేలా పరిపాలన కొనసాగిస్తున్నారన్నారు. ఉద్యమకారులమే కాదు అభివృద్ధికారులుగా ముఖ్యమంత్రి కేసిఆర్ పరిపాలన కొనసాగిస్తున్నారన్నారు.

చిత్రం..శ్రీకాంత్‌చారి విగ్రహం వద్ద నివాళి అర్పిస్తున్న హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి