తెలంగాణ

డిమాండ్‌కు అనుగుణంగా కొత్త కోర్సులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 3: యూనివర్శిటీలు ఎప్పటికపుడు మారాలని, మార్కెట్ డిమాండ్‌కు అనుగుణంగా కొత్త కోర్సులను ఆఫర్ చేయాలని ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి పేర్కొన్నారు. సబ్జెక్టు టీచర్ల కోసం ప్రిన్సిపాల్స్ కోసం కోర్సులు నడపవద్దని, వాటిని మూసేసి, విద్యార్ధులకు అవసరమై కోర్సులు నడపాలని అన్నారు. తెలంగాణలోని 11 యూనివర్శిటీల్లో ప్రమాణాలు, ఫలితాలు పెరగాలని కోరారు. తెలంగాణ యూనివర్శిటీలో సౌత్ బ్లాక్‌కు సమానంగా నార్త్ బ్లాక్ డెవలప్ చేయాలని ఆయన పేర్కొన్నారు. గత పాలకుల నిర్లక్ష్యానికి గురై తెలంగాణలో విద్యావ్యవస్థ దెబ్బతిన్నదని, దానిని తాము గాడిలో పెట్టేందుకు ప్రయత్నిస్తున్నామని ఆయన చెప్పారు. గతంలో యూనివర్శిటీలు, కాలేజీల మంజూరు కాగితంపై మాత్రమే జరిగేదని, వారికి నిధులు, సౌకర్యాలు ఎన్నడూ కల్పించలేదని ఆ భారం తమపై ఇపుడు పడిందని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం మొదట వౌలిక సదుపాయాలను కల్పించి విద్యాసంస్థలను పటిష్టం చేసిన తర్వాతనే అనుమతులు ఇస్తోందని చెప్పారు. తెలంగాణలో ఎక్కువగా బడుగు, బలహీనవర్గాల వారున్నారని, వారికి నాణ్యమైన విద్య రెసిడెన్షియల్ స్కూళ్లలోనే లభిస్తుందని గుర్తించిన సిఎం కెసిఆర్ 254 కొత్త గురుకులాలు ఈ ఒక్కఏడాదిలోనే మంజూరు చేసి నిధులు విడుదల చేశారని అన్నారు. వచ్చే విద్యాసంవత్సరం లో మరో 210 గురుకులాలు మంజూరు చేయడానికి అనుమతి ఇచ్చారని అన్నారు. దేశంలో ఎక్కడా కూడా ఇన్ని గురుకులాలు ఒక్క ఏడాదిలో ఏ ప్రభుత్వమూ మంజూరు చేయలేదని చెప్పారు. మానవ వనరుల అభివృద్ధితోనే బంగారు తెలంగాణ సాధ్యమవుతుందని, అందుకే ప్రమాణాలతో కూడిన విద్య కోసం కృషి చేస్తున్నామని అన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా మార్కెట్ డిమాండ్ మేరకు ఈ రోజు కోర్సులను డిజైన్ చేసుకోవాలని చెప్పారు. సబ్జెక్టు టీచర్లు, ప్రిన్సిపాల్స్ కోసం కోర్సులను నడపవద్దని సూచించారు.