తెలంగాణ

డెన్‌గా మారిన ‘టఫ్’!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 4: తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్ కార్యాలయం తీవ్రవాదుల డెన్‌గా మారిందని హైదరాబాద్ రేంజ్ డిఐజి అకున్ సబర్వాల్ తెలిపారు. జనశక్తి నాయకులు ‘టఫ్’ కార్యాలయాన్ని తీవ్రవాద డెన్‌గా మార్చుకుని తమ కార్యకలాపాలు సాగిస్తున్నారని, తెలంగాణ, ఆంధ్రాలో కొత్తగా మూడు దళాలను నియమించేందుకు కసరత్తు చేస్తున్నారని డిఐజి అన్నారు. ఆదివారం మీడియాతో మాట్లాడుతూ, తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్ కార్యాలయం నుంచే ఆయుధాలు సరఫరా చేస్తున్నట్టు గుర్తించామన్నారు. ఇటీవల అరెస్టయిన జనశక్తి నేత భీం భరత్‌ను విచారించగా కీలక విషయాలు వెల్లడించారని సబర్వాల్ తెలిపారు.
జనశక్తి రాష్ట్ర కమిటీ సభ్యుడు భీం భరత్‌పై 11 కేసులు నమోదై ఉన్నాయని డిఐజి తెలిపారు. ఈ వ్యవహారంలో విమలక్క, అమర్, కూర రాజన్న పాత్రపై విచారిస్తున్నామని, టఫ్ కార్యాలయంతో పాటు, విమలక్క ఇంటిని కూడా సీజ్ చేశామని డిఐజి అకున్ సబర్వాల్ తెలిపారు. మరికొన్ని చోట్ల సోదాలు నిర్వహించవలసి ఉందని, అటు తరువాత వారిని అరెస్టు చేస్తామన్నారు. అవసరమైతే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని డిఐజి స్పష్టం చేశారు. కామారెడ్డి ఎస్పీ శే్వతారెడ్డి మాట్లాడుతూ జనశక్తి కార్యకలాపాలు నిర్వహిస్తున్నారన్న సమాచారంతో హైదరాబాద్‌లోని తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్ కార్యాలయాన్ని సీజ్ చేశామన్నారు. టఫ్ కార్యాలయంలో జనశక్తి కరపత్రాలు స్వాధీనం చేసుకున్నామని, మాచారెడ్డి మండలం రాజీకన్‌పేటలో జనశక్తి సమావేశానికి సంబంధించిన కేసులో మరో పదిమందిని విచారిస్తున్నామని ఎస్పీ శే్వతారెడ్డి తెలిపారు.
అణచివేసే కుట్ర: విమలక్క
ప్రజా ఉద్యమాలను, ఉద్యమకారులను అణచి వేసేందుకు ప్రభుత్వం కుట్ర పన్నిందని ప్రజాగాయకురాలు విమలక్క ఆరోపించారు.
యునైటెడ్ ఫ్రంట్ కార్యాలయం సీజ్ అందులో భాగమేనన్నారు. ప్రజల కోసం పనిచేసే టఫ్‌పై రాజకీయ దురుద్దేశంతోనే దాడులు నిర్వహించారని పేర్కొన్నారు. ప్రజాచైతన్యాన్ని ఎవరూ అడ్డుకోలేరన్నారు.

చిత్రాలు..విలేఖరులతో మాట్లాడుతున్న డిఐజి అకున్ సబర్వాల్, ఎస్పీ శే్వతారెడ్డి,
సీజ్ చేసిన టఫ్ కార్యాలయం