తెలంగాణ

మన సత్తా చూపిద్దాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ప్రస్తుతం తెలంగాణలో జరుగుతున్న రాజకీయ చేరికలు సాధారణమైనవి కాదని, భవిష్యత్తు కోసం, ప్రజల బాగు కోసం జరుగుతున్న రాజకీయ పునరేకీకరణ అని సిఎం కె చంద్రశేఖర్‌రావు తెలిపారు. వరంగల్ జిల్లా కాంగ్రెస్‌కు చెందిన మాజీ మంత్రి బస్వరాజు సారయ్య కెసిఆర్ సమక్షంలో క్యాంపు కార్యాలయంలో మంగళవారం తెరాసలో చేరారు. ఈ సందర్భంగా కెసిఆర్ మాట్లాడుతూ అష్టకష్టాలు పడి తెలంగాణ సాధించుకున్నాం. వచ్చిన తెలంగాణను గొప్పగా తీర్చిదిద్దుకోవాలి. దేశంముందు గెలవాలి. అందుకు తెలంగాణ ఏకం కావాలన్నారు. రాజకీయాలంటే ఐదేళ్లకోసారి ఎన్నికలు రావడం, ఒకరు ఓడడం, ఇంకొకరు గెలవడం సాధారణం. కానీ ఇప్పుడు కావలసింది రాజకీయం కాదు, తెలంగాణ వాళ్లకు పరిపాలన చాతకాదన్న వాళ్లకు సమాధానం చెప్పాలన్నారు. ప్రజలే కేంద్ర బిందువుగా, సమస్యల పరిష్కారానికి పని చేస్తున్నామని, కరెంటు సమస్య లేకుండా చేశామన్నారు. కరువు నివారణకు శాశ్వత చర్యలు తీసుకుంటున్నామన్నారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కట్టుకుంటున్నాం, ఇంకా చాలా చేసుకుంటున్నామని తెలిపారు. ఈ పనులన్నీ జరగాలంటే రాజకీయ శక్తులన్నీ ఏకమై అభివృద్ధిలో ముందడుగు వేయాలన్నారు. బస్వరాజు సారయ్య నాకు మిత్రుడు, తెలంగాణ సాధనకు తన పద్ధతిలో పని చేశారు. ఆయనను కలుపుకొని పోదాం, యువకుడు అనిశెట్టి మురళికీ సాదర స్వాగతమని ఆహ్వానించారు.
విమానాశ్రయం పునరుద్ధరణ
వరంగల్ అభివృద్ధికి ఇప్పటికే అనేక చర్యలు తీసుకున్నామని, నగరానికి ఏటా 300 కోట్ల రూపాయలు కేటాయిస్తామని ముఖ్యమంత్రి తెలిపారు. వరంగల్‌లోని మామునూరు విమానాశ్రయం పునరుద్ధరించనున్నట్టు చెప్పారు. అంతా కలిసి అభివృద్ధి చేసుకోవలసిన అవసరం ఉందని ముఖ్యమంత్రి అభిప్రాయం వ్యక్తం చేశారు. టిడిపి వరంగల్ నగర అధ్యక్షుడు అనిశెట్టి మురళి, కుడా మాజీ చైర్మన్ మూగా రామ్మోహన్, జిల్లా గ్రంధాలయ సంస్థ మాజీ అధ్యక్షుడు డాక్టర్ పోలా నటరాజ్, పలువురు మాజీ కార్పొరేటర్లు, కాంగ్రెస్, టిడిపి నాయకులు ముఖ్యమంత్రి కెసిఆర్ సమక్షంలో టిఆర్‌ఎస్‌లో చేరారు. కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, ఎంపిలు గుండు సుధారాణి, పసునూరి దయాకర్, ఎమ్మెల్యే కొండా సురేఖ, ఎమ్మెల్సీ కొండా మురళి తదితరులు పాల్గొన్నారు.

చిత్రం... కెసిఆర్ సమక్షంలో తెరాసలో చేరిన మాజీ మంత్రి సారయ్య, కాంగ్రెస్ నేత మురళి తదితరులు