తెలంగాణ

లోక్‌సభలో గందరగోళం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 5: పెద్ద నోట్ల రద్దు ఇక్కట్లపై సోమవారం లోక్‌సభలో చర్చ ప్రారంభించిన తెరాస పక్షం నాయకుడు జితేందర్ రెడ్డిని ప్రతిపక్ష పార్టీల సభ్యులు కొట్టినంత పని చేశారు. నోట్ల రద్దుతో దేశ ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై చర్చించేందుకు 193 నియమం కింద జితేందర్ రెడ్డి నోటీసు ఇచ్చారు.
స్పీకర్ సుమిత్రా మహాజన్ నోటీసును చర్చకు స్వీకరించారు. చర్చ ప్రారంభించగానే ప్రతిపక్షం సభ్యులు తృణమూల్ కాంగ్రెస్, కాంగ్రెస్, వామపక్షాల సభ్యులు దూకుడగా జితేందర్ రెడ్డి మీదకు వచ్చి మాట్లాడకుండా అడ్డుకున్నారు. కొందరు సభ్యులు మైకుకు చేతులు అడ్డంపెట్టి మాట్లాడకుండా చేస్తే, టిఎంసి సభ్యుడు కళ్యాణ్ బెనర్జీ, రంజిత తదితరులు వాగ్వాదానికి దిగారు. ప్రతిపక్షం కలిసిగట్టుగా వ్యవహరించాలి తప్ప, విడిగా వ్యవహరించటం ఏమిటని నిలదీశారు. కళ్యాణ్ బెనర్జీ తదితరులు జితేందర్ రెడ్డి మైకును తమవైపు తిప్పుకుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడటంతో సభలో గందరగోళం నెలకొంది. సభ్యుడు మాట్లాడుతున్నపుడు అడ్డుపడవద్దంటూ స్పీకర్ సుమిత్ర ప్రతిపక్షాలకు సూచించినా ఫలితం లేకపోయింది.
అదే సమయంలో జితేందర్ రెడ్డి ప్రసంగం కొనసాగిస్తూ, ప్రధాని మోదీ తీసుకున్న నిర్ణయాన్ని అన్ని పార్టీలూ సమర్థిసున్నాయన్నారు. అయితే నిర్ణయాన్ని ఆచరణలో పెట్టటంలో చోటుచేసుకున్న లోపాల కారణంగా ప్రజలు పడుతున్న ఇబ్బందులు ప్రతిపక్షాలను ఆందోళనకు గురి చేస్తున్నాయన్నారు. పామును మెడలో వేసుకున్న తరువాత కాటు తప్పదని, అయితే ఎక్కువ నష్టం కలగకుండా చూడాల్సిన బాధ్యత అందరిపై ఉందని సూచించారు. ప్రజల కష్టాలను తొలగించేందుకు ప్రతిపక్షం కొన్ని సూచనలు, సలహాలు ఇవ్వాలని అనుకుంటోంది. అందుకే ఈ అంశంపై పార్లమెంట్‌లో చర్చ జరగాల్సిన అవసరం ఎంతో ఉందని అభిప్రాయపడ్డారు. కొత్త నోట్ల కొరత తీర్చటం ద్వారా ప్రజల సమస్యలు వీలైనంత త్వరగా పరిష్కరించాలని ఆయన ఎన్డీయే ప్రభుత్వాన్ని కోరారు. జితేందర్ రెడ్డి మాట్లాడుతున్నంత సేపూ ప్రతిపక్షం సభ్యులు ఆయన వద్ద, పోడియం వద్ద నిలబడి గొడవ చేస్తూనే ఉన్నారు. ప్రతిపక్షం సభ్యుల నినాదాలు తిప్పికొట్టేందుకు అధికారపక్షం కూడా నినాదాలు ఇవ్వటంతో సభ దద్దరిల్లింది. దీంతో స్పీకర్ సుమిత్రా మహాజన్ సభను రేపటికి వాయిదా వేశారు. జితేందర్ రెడ్డి అంతకుముందు జీరో అవర్‌లో ఇదే అంశంపై మాట్లాడుతూ పెద్ద నోట్ల రద్దు వల్ల ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలపై లోక్‌సభలో చర్చించాల్సిన అవసరం ఉందన్నారు. జితేందర్ రెడ్డి నోటీసు ప్రతిపాదనను ప్రతిపక్షాలు అప్పుడే ఖండించాయి. 193 కింద చర్చ జరిగే ప్రసక్తేలేదని పలువురు సభ్యులు తెగేసి చెప్పారు. ఈ దశలో హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ జోక్యం చేసుకుని, 193 నియమం కింద నోటీసుపై చర్చించేందుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. అయితే, ప్రతిపక్షాలు గొడవకు దిగటంతో సభలో పలుమార్లు గందరగోళం నెలకొంది.