తెలంగాణ

భావ స్వేచ్ఛను హరిస్తున్న ప్రభుత్వం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 6: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వ్యక్తుల భావ స్వేచ్ఛను హరిస్తున్నదని టి.పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టివిక్రమార్క విమర్శించారు. విమలక్కను పోలీసులతో అణచి వేసే ప్రయత్నం చేస్తున్నదని ఆయన మంగళవారం విలేఖరుల సమావేశంలో విమర్శించారు.
అలా చేయడం మానవ హక్కుల ఉల్లంఘనే అవుతుందని అన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ చర్యలకు వ్యతిరేకంగా అందరూ గళమెత్తాలని ఆయన కోరారు. ఎస్సీ, ఎస్టీ సబ్-ప్లాన్ చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని, నిధులను ఇతర పథకాలకు మళ్లిస్తున్నదని ఆయన విమర్శించారు. రెండున్నర ఏళ్ళ పాలనలో ఎస్సీ, ఎస్టీలకు కేటాయించిన నిధులపై శే్వతపత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేవారు. అంబేద్కర్ స్ఫూర్తితో వచ్చిన తెలంగాణలో, అంబేద్కర్ పేరిట ఉన్న ప్రాణహిత ప్రాజెక్టును కొనసాగించాలని ఆయన కోరారు. టి.జెఎసి కన్వీనర్ ప్రొఫెసర్ కోదండరామ్ సంధించిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక కాంగ్రెస్ ఏజెంట్ అని విమర్శలు చేయడం భావ్యం కాదని అన్నారు. వెంటిలేటర్‌పై ఉంది మా పార్టీ కాదు టిఆర్‌ఎస్సేనని భట్టివిక్రమార్క ఒక ప్రశ్నకు సమాధానంగా తెలిపారు.