తెలంగాణ

15నుంచి కళాభారతిలో పుస్తకాల పండుగ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 8: తెలంగాణ కళాభారతి (ఎన్టీఆర్ స్టేడియం)లో డిసెంబర్ 15 నుండి 26 వరకు హైదరాబాద్ నేషనల్ బుక్ ఫెయిర్‌ను నిర్వహిస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కెవి రమణాచారి తెలిపారు. సచివాలయంలో గురువారం నేషనల్ బుక్ ఫెయిర్ పోస్టర్‌ను రమణాచారి ఆవిష్కరించారు. నోట్ల రద్దు ప్రభావం లేకుండా నగదు రహితంగా పుస్తకాలు కొనుగోలు చేసే విధంగా నిర్వాహకులు ఏర్పాటు చేయాలని కోరారు. ఫేస్‌బుక్, ట్విట్టర్, బ్లాగులు వచ్చినప్పటికీ నేటికీ పుస్తకాలను ప్రేమించే వారు ఉన్నారని అన్నారు. బిసి కమిషన్ చైర్మన్ బియస్ రాములు బుక్ ఫెయిర్‌ను విజయవంతం చేయాలని కోరారు. టూరిజం శాఖ కార్యదర్శి బి వెంకటేశం, ప్రభుత్వ ఉప కార్యదర్శి శ్రీమతి సుభద్ర, హైదరాబాద్ బుక్ ఫెయిర్ అధ్యక్షుడు, బిసి కమిషన్ సభ్యుడు గౌరీ శంకర్ తదితరులు మాట్లాడుతూ పుస్తక ప్రియులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరారు.