తెలంగాణ

ప్లాస్టిక్ కవర్ల పరిశ్రమలో భారీ అగ్నిప్రమాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

షాద్‌నగర్ రూరల్, డిసెంబర్ 8: విద్యుత్ షార్ట్ సర్య్కూట్ కారణంగా ప్లాస్టిక్ పరిశ్రమలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. గురువారం ఫరూఖ్‌నగర్ మండలం బూర్గుల గ్రామ పంచాయతీ శివారులోని శ్రీనాథ్ రూట్ ప్యాక్ లిమిటెడ్ పరిశ్రమలో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. స్థానికులు, కార్మికుల కథనం ప్రకారం వివరాలిలావున్నాయి. గురువారం మధ్యాహ్నం ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్షణాల్లో అగ్నికీలలు వ్యాపించాయి. సమీప ప్లాట్-1, ప్లాట్-2లో విధులు నిర్వహిస్తున్న కార్మికులు నీళ్లతో మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారు. అగ్నిజ్వాలలో దగ్ధమవుతున్న పరిశ్రమ నుండి కలర్ డబ్బాలు పేలుతుండటంతో కార్మికులు పరుగులు తీశారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్లే పరిశ్రమలో ప్రమాదం సంభవించిందని యజమాన్యం పేర్కొంటోంది. షాద్‌నగర్ అగ్నిమాపక దళం మంటలను అదుపులోకి తీసుకువచ్చింది. ఈ ప్రమాదంలో సుమారు 20కోట్ల ఆస్తి నష్టం వాటిల్లినట్లు యజమాన్యం చెబుతోంది. ప్రమాదం జరిగిన సమయంలో యంత్రాలను నడుపుతున్న బిహార్ రాష్ట్రానికి చెందిన ఒక కార్మికుడు తీవ్రంగా గాయపడ్డాడు. గాయపడిన కార్మికుడిని అంబులెన్స్‌లో హుటాహుటిన హైద్రాబాద్‌లోని ఓ ప్రైవేట్ వైద్యశాలకు తరలించారు. ఈ సంఘటనపై షాద్‌నగర్ ఎస్సై నారాయణసింగ్ దర్యాప్తు చేస్తున్నారు.