తెలంగాణ

బ్లాక్ మార్కెట్‌కు నిత్యావసర సరుకు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ప్రజలకు సబ్సిడీ ధరకు నిత్యావసర సరుకులు అందాలనే సద్దుశంతో పౌరసరఫరాల శాఖ చేస్తున్న ప్రజాపంపిణీ వ్యవస్థలో అక్రమాలు, దుర్వినియోగాన్ని అరికట్టాల్సిన అవసరం ఉందని సిఎం కె చంద్రశేఖర్‌రావు పిలుపునిచ్చారు. క్యాంపు కార్యాలయంలో బుధవారం పౌరసరఫరాల శాఖపై ముఖ్యమంత్రి కెసిఆర్ సమీక్ష జరిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ప్రదర్శించిన అలసత్వం, నిర్లక్ష్యం ఇకముందు తెలంగాణ రాష్ట్రంలో కొనసాగితే ఎట్టిపరిస్థితుల్లోనూ సహించేది లేదని సిఎం హెచ్చరించారు. పేదలకు అందాల్సిన సరుకులు బ్లాక్ మార్కెట్‌కు తరలుతున్నాయని, పౌరసరఫరాల శాఖలో వివిధ విభాగాలు కుమ్మక్కు కావడం వల్లనే ఇది సాధ్యమవుతుందని అభిప్రాయపడ్డారు. అక్రమాలకు తావులేని విధంగా ప్రజాపంపిణీ వ్యవస్థను మార్చాల్సిన అవసరం ఉందని సిఎం అన్నారు. దుబారా, విచ్చలవిడితనం తగ్గాలని, నిత్యావసర సరుకుల ధరలు పెరిగినప్పుడు పౌరసరఫరాల శాఖ జోక్యం చేసుకుని ప్రజలకు తక్కువ ధరతో అందించడానికి కృషి చేయాలని సూచించారు. సమావేశంలో ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ, పౌరసరఫరాల శాఖ కమిషనర్ రజత్ తదితరులు పాల్గొన్నారు.